6. లభ్య పోటాష్ ;

ఫ్లేంఫోటో మీటరు అనే యంత్ర పరికరం ద్వారా నెలలోని లభ్య పొటాషను నిర్ధారిస్తారు. హెక్టర్ కు 15౦ కిలోల తక్కువ వున్నప్పుడు అల్ప స్థాయి గాను, 15౦-౩౦౦ కిలోల వరకు వున్నప్పుడు మధ్యస్థాయి గాను, ౩౦౦ కిలోల వున్నప్పుడు అధిక స్థాయి గాను విభజించారు. రాష్ట్రంలో ఎక్కువ భాగం భూముల్లో మధ్య స్థాయి నుండి ఆహ్దిక స్థాయికి పోటాష్ వుంది. నేలల్లో  లభమయ్యే పోటాష్ పరిమాణాన్ని బట్టి, పైరును బట్టి మోతాదులు నిర్ణయిస్తారు. పత్తి, మిరప, ఉల్లి, పొగాకు, అల్లం, చేమ, కంది వంటి దుంప పైర్లు పోటాష్ ను అధికంగా తీసుకుంటాయి.

          సాధారణంగా వర్షాధారపు పైర్లకు దేశవాళి రకాలకు నేలల్లో  అధిక దిగుబడి రకాలకు, ౩౦ నుండి 40 కిలోల వరకు వేయాలి. పోటాష్ అల్ప స్థాయిలో వుండే నేలలకు  మరికొంత అదనంగా వేయాల్సి వుంటుంది. పోటాష్ ఎరువులను సామాన్యంగా రెండు దఫాలుగా విభజించి వేయాలి.