4. సేంద్రియ కార్బోనం;
నెలలో వున్న సేంద్రియ పదార్దాన్ని తెలుసుకోవడానికి ముందుగా సేంద్రియ కార్బోనం నిర్ధారిస్తారు. సేంద్రియ కార్బన్ శాతాన్ని 1.7౩2తో గుణించగా నేలలోని సేంద్రియ పదార్ధ శాతం తెలుస్తుంది. దీనిలో పైర్లకు అవసరమైన అన్ని పోషకాలు కొద్ది మోతాదుల్లో వుంటాయి. సేంద్రియ పదార్ధం పైరు పెరగడానికి అనుకూలమైన భౌతిక లక్షణాలు, నేల గుల్ల బారడం, నేలలో తేమను పట్టి పెట్టుకునే శక్తీ, మురుగు సౌకర్యం వృద్ది చెందడం వంటి వాటికీ తోడ్పడుతుంది. రాష్ట్రం మొత్తం మీద నేలల్లో సేంద్రియ పదార్ధం తక్కువగా వుంది.
నేలలోని సేంద్రియ కార్బానాన్ని రసాయనాలతో ఆక్సీకరణ చెందేటట్లు చేసి ఫలితంగా ఏర్పడిన రంగును ప్రామాణిక రంగుల పటంతో పోల్చి చూసి వివిధ స్తాయిలుగా నిర్ధారిస్తారు.
తక్కువ స్తాయిలో వున్నప్పుడు హేక్టరుకు 10 టన్నులు, మధ్య స్థాయిలో వున్నప్పుడు 5-6 టన్నులు సేంద్రియ ఎరువులు వేయాలి. అయితే రసాయన ఎరువులు మోతాదులు సిఫారులు చేయడంలో సేంద్రియ కార్బనాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. నేలలోని మొత్తం నత్రజని పరిమాణం (టోటన్ నైట్రోజన్) తెలుసుకోవడానికి ఇది సూచికగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఇందులో నుండి పైరుకు లభ్యమయ్యే నత్రజని (అవే లేబుల్ నైట్రోజన్) నిర్ధారించడంలో వున్న పరిమితులు దృష్ట్యా ప్రస్తుతానికి ఆయా జిల్లాలకు, ప్రాంతాలకు, సిఫారసు చేసిన నత్రజని సాధారణ మొతదులోనే సూచించడం జరుగుతుంది. నత్రజనిని వాడకం వాళ్ళ దాదాపు అన్ని నేలల్లో పైర్లలో స్పష్టమైన ప్రభావం, అపూర్వమైన స్పందన కనిపిస్తుంది. దిగిబడులు గణనీయంగా పెరుగుతున్న ఫలితంగా సర్వత్రా లోపించినట్లు నిరుపితమవుతున్నది.
కనుక సేంద్రియ కార్బనంతో సంబంధం లేకుండా అన్ని నేలలకు పూర్తి మోతాదు నత్రజనిని సిఫారసు చేస్తున్నారు . ఈ దశలో మరిన్ని పరిశోధనంశాలు వెలువడే వరకు, భూసార పరిక్షలకు అవసరమైన త్వరిత, సులభ పద్దతులు రూపొందించే వరకు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చు.
నత్రజని మోతాదును నిర్ధారించటానికి పంట దిగిబడి లక్ష్యంగా పెట్టుకొని సిఫారసు చేసే మరో పద్దతి ఉన్నప్పటికీ కొన్ని పరిమితుల దృష్ట్యా అది కూడా ప్రాచుర్యం పొందడం లేదు.
నత్రజని సమర్ధ వాడకానికి సాధారణంగా బరువు నెలలో 2-౩ దఫలుగాను, మధ్యస్త, తేలిక నేలలో ౩-4 దఫాలుగా విభజించి చేయాలి.