రసాయనిక ఎరువుల వాడకంలో ఈ క్రింది జాగ్రత్తలను విధిగా తీసుకోవాలి.

అప్పుడే అవి సమర్ధవంతంగా పని చేస్తాయి.

  1. సూచించిన నత్రజని ఎరువును భూమి రకాన్ని బట్టి రెండు లేక మూడు సమాన విడతలుగా వేయాలి. నల్లరేగడి ఇతర బంకమన్ను ఎక్కువగా వున్న  భూముల్లో నత్రజనిని రెండు దఫాలుగా వేస్తే సరిపోతుంది. చెల్క మరియు తేలిక భూముల్లో పంట కాలాన్ని బట్టి నత్రజనిని మూడు దఫాలుగా వేయవచ్చును. ఇసుక ఎక్కువగా వుంది నిరు త్వరగా ఇంకే భూముల్లో నత్రజని నలుగు దఫాలుగా కుడా వేయవలసిన అవసరం ఎంతైనా వుంది. నత్రజని ఎరువును ఒకేసారి (ఫాస్పరస్ మరియు పోటాష్ ఎరువుల మాదిరిగా) వేస్తె, వేసిన నత్రజని ఎరువు సాగు నీరు కట్టినప్పుడు, మురుగు నీటితో వృధాగా పోయి మొక్కలకు అందదు.
  2. సూచించే మొత్తం ఫోస్పరాస్ మరియు పోటాష్ మరియు మొదటి దఫా నత్రజని ఎరువులను వేస్తే ముందు నేలలో వేయాలి. వీటిని చేను మొత్తం మీద వేదజల్లకుండా  వరుసలోపెరిగే పంట అయితే ఎరువు గింజలకు తగలకుండా, గింజ పక్కగా 2 అంగుళాలు, గింజ కన్నా 2 అంగుళాలు లోతుగా వేయాలి.
  3. మాగాణి  వరి పైరుకు ఎట్టి పరిస్తిలోను నైట్రేట్ నత్రజని కలిగి వున్న రసాయనిక ఎరువులను వాడరాదు. వరి పైరుకు మొదట దఫా నత్రజని ఎరువు ఇతర ఫాస్పరస్ మరియు పోటాష్ ఎరువులతో కలిపి, కరికట్టు సమయంలో కొద్ది నీరు వుంచి దుక్కిలో వేయాలి. ఈ నీరు పూర్తిగా భూమిలో ఇంకి పోయేంత వరకు తిరిగి నీరు పెట్టరాదు.  అలా అన్ని పొలాన్ని ఎండనియరాదు. మూడు – నాలుగు రోజుల తర్వాత తిరిగి నీరు పెట్టాలి.
  4. చెరుకు, పత్తి ఇతర తోటలు మరియు సాలు పైర్లకు దఫాలుగా వేసి నత్రజని ఎరువును వేళ్ళకు వెంటనే అందుబాటులో వుండేలా తగు లోతు వరకు రంధ్రాలు చేసి, నత్రజని ఎరువును రంధ్రంలో వేసి మట్టిలో కప్పాలి. తరువాత మాములుగా నీరు కట్టాలి.
  5. సూపర్ ఫాస్పాట్ ను రబీ మెట్ట పైరుకు వేసి, ఆ తర్వాత ఖరిఫ్ లో వరి పైరు వేస్తె ఫాస్పరస్ ఎరువు సామర్ధ్యం పెరిగి అధిక ఆదాయం వస్తుంది.
  6. జింకు లాంటి సూక్ష్మ పోషక పదార్ధం భూమిలో లోప స్థాయిలో వున్నప్పుడు, నత్రజని, ఫాస్పరస్  మరియు పోటాష్ ఎరువులు ఎంత వేసినప్పటికీ, సరియైన పంట దిగుబడి రాదు. అటువంటి సందర్బాలలో విధిగా (జింకు లోపాన్ని) జింకు సుల్ఫటేను ఎకరానికి మెత్తకు 10 కిలోలు, మగాన్నికి 20 కిలోలు వేసి జింకు లోపాన్ని సరి చేయాలి. అప్పుడే వేసిన ఇతర ఎరువుకు అధిక ఫలసాయం వస్తుంది.
  7. నేల ఉదజని సుచికపై ఆధార పది ఎరువులు వేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆమ్ల  లక్షణాలు గల భూముల్లో భాస్వరం లభ్యత తగ్గుతుంది. కాబట్టి సూపర్ ఫాస్ఫేట్ ఎరువును అధికంగా వాడాలి. సాధారణంగా ఉదజని సూచిక 6.5 నుంచి 7.6 వరకు వుండే తటస్థ భూముల్లో అన్ని పోషకాలు మొక్కకు లభ్య మయ్యే అవకాసం వుంటుంది. ఉదజని సూచిక తక్కువగా (4.5  నుంచి 6.౦వరకు) ఆమ్ల  భూముల్లో సున్నం వేసుకుని, అలాగే ఉదజని సూచిక అధికంగా వుంటే చౌడు భూముల్లో జిప్సం వేసుకుని తటస్థ స్థాయికి భూములను మార్చుకోవచ్చును.
  8. చౌడు భూముల్లో ఆమ్ల లక్షణాలు గల  యూరియా సూపర్ ఫాస్పేట్  వంటి ఎరువులను వాడితే మంచి ఫలితం వుంటుంది. అలాగే సున్నం అధికంగా వుండే సున్నపు నేలలు (కాల్కేరియాస్) భూముల్లో సూక్ష్మ పోషకాల లభ్యత  తక్కువ గనుక, ఇలాంటి నేలలకు సూక్ష్మ పోషకలైన జింకు, ఇనుము, కాపర్, బోరాన్లాంటివి లాంటివి తప్పకుండా వాడాలి.