మట్టి నమూనాలు సేకరణ;

భుసార పరిక్షలకు మట్టి నమూనాల సేకరణ మెదటిదే కాకుండా ముఖ్యమైన అంశంగా భావించాలి. సరైన నమూనా తీయడం కార్యక్రమ విజయానికి తొలి మెట్టు. తీసిన మట్టి నమూనా పొలంలోని మట్టి లక్షణాలకు తగు జాగ్రత్తలతో తీసిన నమూనా నుండి వచ్చే ఫలితాలు, సలహాలు యధార్ధంగాను, లాభదాయకంగానూ వుంటాయి. పొలాలు ఖాళీగా వున్నా సమయంలో ఎప్పుడైనా మట్టి నమూనాలు తీయవచ్చు. సంవత్సరానికి ఒక పంట పండించే భూముల్లో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ నెలలు మధ్య కాలంలో రెండు పంటలు పండించే భూముల్లో మే నేలలో  నమూనాలు సేకరించడానికి అనువుగా వుంటుంది. మట్టి నమూనాలు సేకరణకు లోహపు గొట్టం, అగరు వంటి సాధనాలు ఉపయోగించవచ్చు. లేదా రైతులకు అందుబాటులోకి పార, దోకుడు పార, గడ్డ పలుగు సహాయంతో మట్టి నమూనాలు తీయవచ్చు. నేల రకం, రంగు, సాగునీటి వసతి, మెరక, పల్లం, సేద్య పద్దతులు, పంట దిగుబదిలోకి వ్యత్యాసం ఆధారంగా వేరు వేరు నమూనాలు తీయాలి. పొలం విస్తీర్ణం ఎంత తక్కువైనప్పటికీ తేడాలు గుర్తించినప్పుడు అన్ని నమూనాలు వేరు వేరుగా తీయాలి. పొలం అంతా ఒకే రకంగా వున్నపుడు 2 హేక్టరులు (5 ఎకరాలు) విస్తిర్ణనికి ఒక్కో మట్టి నమూనా తీస్తే సరిపోతుంది.

ఒక మట్టి నమూనా తియదలచిన పొలంలో 10 నుండి 12  చోట్ల మట్టిని సేకరించాలి.  నేలపై చెత్తా చెదారం తీసివేయాలి. పార ఉపయోగించి వి ఆకారంలో 6  అంగుళాలు (15 సెం.మీ) లోతు  గుంత తీయాలి. పై నుండి దిగువ వరకు ఒకే మందంలో పలుచని పొర వచ్చే విధంగా మట్టిని తీయాలి. ఇలా  అన్నిచోట్ల తీసిన మట్టిని గొనె పట్ట లేదా పోలితిన్ షీట్ లేదా వేసి మట్టి గుడ్డలను చుదిమి, బాగా కలిపి, చతురస్రాకారంలో పరిచి, ఉజ్జాయింపుగా నాలుగు భాగాలుగా విభజించాలి.

          వీటిలో 1, ౩ భాగాలు  వుంచుకొని, 2, 4  భాగాలలోని మట్టి తీసివేయాలి. మిగిలిన మట్టిని మరల కలిపి అదే విధంగా నలుగు బాగాలు చేసి 2,4  భాగాలు వుంచుకొని 1, ౩ భాగాలూ తీసివేయాలి. సుమారు ½ కె.జి. మట్టి వచ్చు వరకు ఈ విధంగా చేయాలి.  దీనిని చతుర్విభజన పద్దతి అంటారు. నమునాను శుభ్రమైన గుడ్డ సంచిలో గాని, పాలిథిన్ సంచిలో గాని వేయాలి. ఎరువులకు ఉపయోగించిన గొనె సంచులు, పాలిథిన్  సంచులు మట్టి నమూనాల సేకరణలో వాడకూడదు.