నమూనాలు సేకరించడంలో మెళకువలు;

పొలంలోని మట్టి లక్షణాలకు పోలిక లేనిచోట్ల లేదా ప్రాతినిధ్యం వహించని చోట్ల మట్టి నమూనా తీయకూడదు. చెట్ల కింద, గట్ల పక్కన, కంచే దగ్గర, కలిబాటలలో నమూనాలు తీయకూడదు. పశువుల ఎరువు, కంపోస్ట్ కుప్పలు నిలువ వుంచిన చోట్ల నమూనాలు తీయకూడదు.

బాగా సారవంతమైన చోట్ల, మరీ నిస్సారవంతమైన చోట్ల మట్టిని కలిపి తీయకూడదు.

చౌడు భూముల్లో నమూనాలు విడిగా తీయాలి. వీటిని సాధారణ భుముల్లోని మట్టితో కలిపి తీయకూడదు.

రసాయన ఎరువులు వేసిన 45 రోజులు లోపు నమూనాలు తీయకూడదు.

నమూనా తీసేటప్పుడు నేలపై వున్న ఆకు, అలము, చెత్త చెదరము తీసివేయాలి. కాని పైన వున్నా మట్టిని తొలగించకూడదు.

సాధారణంగా నీరు  నిలిచి బురద వున్నా నేల నుండి నమూనా తీయకూడదు. తప్పనిసరిగా తీయవలసి వచ్చినపుడు నీడలో ఆరబెట్టి పరీక్షకు పంపాలి.

మెట్ట, ఆరుతడి సేద్యంలో పైరు పెరుగుతున్న సమయంలో నమూనా తియవలసినప్పుడు వరుసల మధ్య నుండి నమూనా సేకరించాలి.

చౌడు భూముల్లో ౦ -15 , 15-౩౦ సెం.మీ. లోతులో రెండు నమూనాలు తీయాలి.

పండ్ల తోటలు వేయదలచిన పొలంలో ఒక సామాన్య ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అందులో 6 అడుగుల గొయ్యి తీసి ప్రతి అడుగుకు పై నుండి కిందికి ఒక మట్టి నమూనా చొప్పున వివరాలతో పరీక్షా కేంద్రానికి ఒక మట్టి నమూనా వివరాలతో పరీక్షా కేంద్రానికి పంపాలి.

          రైతులు మట్టి నమూనాలు ఎలా సేకరింఛలో వ్యవసాయ విస్తరనధికారి సూచిస్తారు.  కొద్దిమంది రైతులు పొలాలలో నమూనాలు సేకరించి పంపడం కూడా జరుగుతుంది. ఆ ఫలితాలు వీరి ద్వారానే రైతులకు అందుతాయి. విస్తారదికారులు నుంచి అందిన నమూనాలు వేల సంఖ్యలో వుంది, పరిక్షలు జరిపి ఫలితాలు పంపడానికి ఆలస్యం కావచ్చు. ఒక్కోసారి సీజన్ దాటినా తర్వాత ఫలితాలు అందే అవకాశం వుంది. కావున రైతులు తమ పొలంలోనే ఆ మట్టిని తామే సేకరించి భుసార పరిక్ష కేంద్రానికి వేరుగా కాని విస్తారనదికారులతోకాని పంపడం మంచిది. ఈ విధంగా  వచ్చిన నమూనాలు ప్రత్యేకంగా రైతులు రిజిస్టర్లో నమోదు చేసి వరం, పది రోజులలో వారి చిరునామాకు తెలుగులో అచ్చువేసిన కార్డు ద్వారా ఫలితాలు, సలహాలు పంపుతారు. అవసరం అయితే వాటిపై వివరణకు విస్తరనదికరుల నుండి తెలుసుకోవచ్చు. సుక్ష్మ పోషక లోపాలను గురించి తెలుసుకోదలచినప్పుడు ప్రత్యేకంగా కోరిన మీదట విశ్లేషణ చేపట్టి, సలహాలివ్వడం జరుగుతుంది. దీనికి కావలసిన యంత్ర పరికరం అందుబాటులో వున్నా భుసార పరీక్షా కేంద్రంలోనే విశ్లేషణ సాధ్యపడుతుంది.

          తక్కువ దిగిబదినిచ్చే భూముల నుండి, సమస్యాత్మక భూముల నుండి నమూనాలు సేకరించడానికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఎక్కువ ఉపయోగం వుంటుంది.  పంట తీసుకున్న వెంటనే భూములు ఖాళీగా వున్న సమయంలో, రైతులకు సకాలంలో సిజనుకు ముందుగా అంది ఉపయోగబడతాయి.