నేల రంగు స్వభావం-

సాధారణంగా నేలరంగును నలుపు, ఎరుపు, మసక నేలలుగా చెప్పుకున్నప్పటికి నిశితంగా పరిశీలించినప్పుడు వేరు వేరు రంగులు గోచరిస్తాయి. మాన్ షెల్ కలర్ చార్టు అనే ప్రామాణిక రంగులు పాఠం ద్వారా పోల్చి చూసి నేల రంగు ఖచ్చితంగా నిర్ధారిస్తారు. ఉదజని సూచిక విభజన లోను, భాస్వరం పోషక మోతాదు లెక్క కట్టడంలోను నేల రంగును పరిగణనలోకి తీసుకుంటారు.

          నేలలో బంకమన్ను ఒండ్రు, ఇసుక ఉజ్జాయింపుగా ఏ పాళ్ళల్లో ఉన్నదో సూచించడానికి నేల స్వభావ నిర్ధారణ తోడ్పడుతుంది. చిటికెడు మట్టి తీసుకోని తగు మాత్రం నీటిలో తడిపి చూపుడువేలు, బొటనవేలు మధ్య ఒత్తిడితో రాపిడి చేసినప్పుడు కలిగే స్పర్స చేత తేలిక నేల (ఇసుక నేల) మధ్యస్త నేల (గారప నేల) బరువు నేల (బంకనేల) లను నిర్ధారించవచ్చును. గరుకుగా వున్నవి తేలిక నేలలుగాను, జిగురుగా వున్నవి, బరువు నేలలుగాను, గరుకు, జిగురు జర’ర వున్నవి మధ్యస్త నేలలుగాను స్తూలంగా విభజించవచ్చును. లవణ పరిమాణ సూచికను విభజించడంలో నేల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.