౩. లవణ పరిమాణ సూచిక;
ఈ సూచిక ఎలక్ట్రిక్ కండుక్టివేబ్రిడ్జి అనే పరికరం ద్వారా మట్టి, నీరు 1;2 నిష్పత్తిలో కలిపి వడకట్టి నిర్ధారిస్తారు. ఇది భూమిలో వున్న, నీటిలో కరిగే లవణాలను నిర్ధారించే సూచిక. దీనిని మిలిమోస్ సెం.మీ. లెక్కకడతారు. అన్ని నేలల్లో లవణాలు వుంటాయి. అయితే అవి ఒక పరిమితికి మించి వున్నప్పుడు మొక్కకు హానీ కలిగిస్తాయి. ఇలాంటి నేలలను పాలచౌడు నేలలంటారు . వాటిని బాగు చేయడానికి తగిన సూచనలు ఇస్తారు.