తెల్ల చౌడు భూములు;
నీటిలో కరిగే లవణాలు ఎక్కువగా వున్న భూములను పాల చౌడు లేదా ఉప్పు భూములని అంటారు. ఈ లవణాల పరిమాణం ఎక్కువగా వుండడం వలన ఎండాకాలములో ఈ లవణాలు భూమిపైన తెల్లని పొరగా ఏర్పడతాయి.
ఈ భూములలో ఉదజని సూచిక 8.5 కన్న తక్కువగను, నీటిలో కరుగు లవణ పరిమాణ సూచిక 4.౦ డేచి సిమన్స్ కన్నా ఎక్కువగాను, మార్పిడి చెంది సోడియం శాతం 15 కన్నా తక్కువగా వుంటుంది.
యాజమాన్యం;
ఒకవేళ పాల చౌడు విస్తీర్ణం తక్కువగా వుంటే, నేలపై ఏర్పడిన తెల్లని పొరను పారలతో గికి తీసివేయాలి.
పాల చౌడు భూములను బాగు చేయాలంటే మొదటి పొలాన్ని చదును చేసి చిన్న చిన్న మదులుగా చేసుకోవాలి. సుమారు 9 మంచినీటిని ఈ మడుల్లోకి వదిలి, దమ్ము చేసి నీటిని నిల్వ వుంచడం వలన లవణాలు ఈ నీటిలో కరిగి వుంటాయి. మరుసటి రోజు మురుగు కలువల ద్వారా ఈ నీటిని తెసేయ్యాలి. ఈ విధంగా నాలుగైదు సార్లు చయడం ద్వారా లవణాలను మనము చాలా మటుకు నివారించవచ్చు. ఈ మరుగు నీటిని పొలంలో పల్లాపు ప్రాంతాల్లో లోతైన కాలువలు చేసి దానిలో వదిలి అక్కడ నుండి పొలానికి దూరంగా వదిలేయాలి. సాగు నీటికి మరియు మురుగు నీటికి వేరు వేరు కాలువలు వుండాలి.
పై పద్దతుల ద్వారా లవణ పరిమాణాన్ని పూర్తిగా తగ్గించే అవకాశం లేని చోట్ల లవణ సంద్రతలను తట్టుకునే పంటలు ప్రత్తి, ఆవాలు, వారి, షుగర్ బిట్, బచ్చలి వేసుకోవచ్చు. ఈ పంటల ద్వారా లవన్ పరిమాణాన్ని అదుపు చేసుకోవచ్చు.