సున్నం గులక రాయి గల భూములు

ఈ భూములలో కాలిషియం కార్బోనేతే శాతం ఎక్కువగా వుంటుంది..  సరైన ఆకారం లేక చిన్న చిన్న గుళికల నుంచి పెద్ద కంకర రాళ్లు పరిమాణంలో కూడ సున్నాన్ని పాలలో చూస్తుంటారు. ఇలాంటి భూముల్లో కూడ ఉదజని సూచిక సుమారు 8.౦ పైన వుంటుంది.

పండ్ల తోట భూముల్లో అనేక పోషక పదార్ధాలు లోపాలు కనిపిస్తాయి. ఇందులో ముఖ్యంగా ఇనుము, జింకు, బాస్వరం లోపాలు కనిపిస్తాయి.

యాజమాన్యం;

ఇలాంటి భూముల్లో సున్నం  శాతం తగ్గాలంటే చివికుతున్న సేంద్రియ పదార్ధాలు అంటే పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, ఆముదపు లేదా వేప పిండి ఎరువులు, వర్మి కంపోస్ట్, పిల్టర్ మడ్డి, పచ్చి ఆకులు, కానుగ, గ్లేరిసిడియం, వేప, తంగేడు, జిల్లేడు, నల్లేరు, అవిశ మొదలైనవి వాడవచ్చు. ఇవేకాక రసాయనిక పదార్దాలైన ఐరన్ పైరేట్ ను వాడితే మంచి ఫలితాలు పొందవచ్చు. వీటి నుండి విడుదలై ఆమ్లాలు కార్బోనేట్ లను తొలగిస్తాయి. వాడి నీరులో  కార్బోనేట్, బై కార్బొనేట్లు అతి త్వరగా ఉండేటట్లు చూడాలి. లేకపోతే  వీటి ప్రభావం నేల మీద కనిపిస్తుంది.

ఈ భూముల్లో పండించే పండ్ల తోటలకి ఇనుము, జింకు, భాస్వరం ఎక్కువ మోతాదులో వేయాల్సి వుంటుంది.

పండ్ల తోటల్లో లోప లక్షణాలు కనిపించిన వెంటనే పిచికారి ద్రావనలతో సవరించుకోవాలి. లేకపోతే చెట్ల పెరుగుదల కుంటుపడుతుంది. లోపం తీవ్రంగా వుంటే మొక్కలు క్రమేపి చనిపోతాయి.

ఇలాంటి భూముల్లో యాజమాన్యం దీర్ఘకాలం చేస్తే భూమిలో ఉన్న కాల్షియం కార్బోనేట్ శాతం చాలా వరకు తగ్గించవచ్చు.