గట్టి పడే ఎర్ర చల్క భూములు ;

ఈ భూములలో ఇసుక శాతం 60 నుంచి 70 బంక మన్ను శాతం 25 నుంచి ౩౦ వరకు వుంటుంది.

చల్క భూములలో వర్షం పడిన తరువాత తేమ ఉన్నంత మటుకు మెత్తగా వుంటుంది. అదే ఎండిన తరువాత పై భాగము గట్టి పడుతుంది. అందువలన విత్తనాలు మొలకేత్తదు. కాబట్టి పంటకు కావలసిన నీరు, గాలి, పోషక పదార్దములు చొచ్చుకొని పోవు. కాబట్టి పంటకు కావలసిన నీరు, గాలి, పోషక పదార్దములు అందవు. కావున పంట ఎదుగుదల వుండదు కాబట్టి దిగిబడులు పడిపోతాయి.

యాజమాన్యం ;

ఈ భూముల యాజమాన్యంలో ముఖ్యమైనవి. ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువుల వాడటం.

ఇలా చేయటం వల్ల ఈ భూముల్లో నీటిని నిల్వ వుంచుకునే శక్తీ పెంచటమే కాకుండా తొందరగా ఆవిరి అవ్వకుండా చేస్తుంది. మొక్కల వేర్లకు తగినంత గాలి కూడా అందిస్తుంది.

సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కంపోస్ట్, పొడి చేసిన వేరుశనగ తొక్కలు, వరి పొట్టు, వరి గడ్డి, ఎండిన చెరకు ఆకులూ వంటి పదార్ధాలను విత్తనపు వరుస పక్కన వేస్తె వర్షపు బిందువుల ఒత్తిడి ప్రభావం నేల మీద పడకుండా ఉంటుంది. వేసిన సేంద్రియ పదార్ధాల వలన పోను పోను భు భౌతిక స్తితిలో మంచి మార్పులు వస్తాయి.

ఇవే కాక కొన్ని ప్రాంతాలలో మరికొన్ని యాజమాన్యం పద్దతులు చేస్తున్నారు.

నిటి సౌకర్యం వున్నా చోట్ల చేలకు నీరు క్రమంగా తక్కువ పరిమాణంలో చాలాసార్లు ఇస్తే తేమ ఆవిరి కాకుండా వుంటుంది.

ముళ్ళ పొదల కొమ్మలతో మొక్కల మధ్య వరుసలలో తేమ వున్నపుడు నేలపైన పలుచని పొరలను కదిలించటం

పొలంలోనే వరుసల గట్టుపైనా విత్తనాలు నాటడం ద్వారా కొంతమేరకు ఎలాంటి భూములను బాగు చేసుకోవచ్చు.