ఇసుక నెలలు;

ఈ భూములను సముద్ర తిరాలైన కోస్తా ప్రాంతాలలో చూస్తుంటాం. ఈ భూముల్లో ఇసుక రేణువుల శాతం ఎక్కువగా వుంటుంది. అందువలన నత్రజని,, పోటాష్ ఎరువులు, నిటి వినియోగ సామర్ధ్యం చాలా తక్కువగా వుంటుంది. పైర్లలో సూక్ష్మ ధాతు పోషకాల లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి.  ఈ భూములు యాజమాన్యానికి బంకమన్ను, చెరువు మట్టి, ఒండ్రు మట్టి 2 శాతం చొప్పున కలిపితే నీరు పిల్చుకునే శక్తీ, నత్రజని పోటాష్ ఎరువులు వృధా కాకుండా వాటి వినియోగ ఎక్కువ అవుతుంది.

బరువైన గుండ్రని బండరాయి సుమారు 100 నుండి 15౦ కిలోలు వున్న దానిని ఎద్దులతో లాగించినప్పుడు కూడా ఈ భూములను కొంతవరకు మెరుగుపరచవచ్చు. ఇలా చేయడం వల్ల ఇసుక రేనువులలోని గాలి శాతం రంధ్రాలు తగ్గి, నీరు పిల్చుకునే శాతం పెరుగుతుంది. ఈ భూముల్లో నత్రజని పోటాష్ ఎరువులను పలు దఫాలుగా వేయడం మంచిది.