నల్ల చౌడు భూములు లేదా కారు చౌడు లేదా అధిక క్షార నేలలు ;
ఈ నేలలు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలలోను, ఆయకట్టుల క్రింద సాగు నీటిలో పండించే పంట భూములలో గాని లేదా బావులలోని నిరు మంచిది కానప్పుడు, అది సాగుకు వాడినట్లయితే మనకు ఈ నల్ల చౌడు నేలలు కనిపిస్తుంటాయి. ఈ భూములలో ఉదజని సూచిక 8-5 కన్నా ఎక్కువగాను,నీటిలో కరుగు లవణ పరిమాణం 4 కన్నా తక్కువగను, మార్పిడి చెందు సోడియం శాతం 15 కంటే ఎక్కువగా వుంటాయి.
ఈ భూములలో లవణాల సాంద్రత తక్కువగానే వున్నా మార్పిడి చెందు సోడియం ఎక్కువగా వుంటుంది. భూమిలోని సేంద్రియ పదార్ధము భూమిపైన లవణాలతో సహా పెరుకోవటం వలన నల్లగా కనిపిస్తుంది. అందువలనే ఈ నేలలకు ఈ పేరు వచ్చింది.
నేల ఎండి నప్పుడు గట్టిగా బండబారి వుంటుంది. తగినంత నీరు వున్నప్పుడు బురద తయారవుతుంది.
నీరు ఎప్పుడు తెరుకోదు, ఇంకదు
నేలలోని సేంద్రియ పదార్ధం, హ్యుమాస్ కలిగిన కారణంగా కారు చౌడు నేలలకు అందులో నిలబడిన నీటికి నల్లని రంగు వస్తుంది. ఈ నేలలో మొక్క మొలవదు. మొలచిన ఎదుగుదల వుండదు.
మొక్కలకు కావలసిన పోషక పదార్ధ లయినతువంటి నత్రజని, భాస్వరం, కాల్షియం, మేగ్నిసియం, ఇతర సూక్ష్మ పోషక పదార్దములు చాలా తక్కువ పాళ్ళలో లభిస్తాయి.
యాజమాన్యం;
ఈ నల్ల చౌడు భూములను బాగు చేయాలంటే ఈ భూముల్లో గల సోడియం, (ఉప్పు)ను, ఉదజని సూచికను తగ్గించాలి. ఈ ప్రక్రియను చేయడానికి జిప్సం, గంధకం, ఐరన్ ప్లేట్స్, షస్పో జిప్సంను వాడాలి. వీటిలో జిప్సం చాలా అనుకూలమైనది. బాగా దొరుకుతుంది. ధర కూడా తక్కువే.
మట్టి నమూనాలను భుసార పరీక్షా చేయించినప్పుడు జిప్సం ఎంత వాడాలన్నది తెలుస్తుంది.
కొద్దిగా సిఫార్సు చేస్తే ఒకేసారిగా ఎక్కువ మొత్తం సిఫార్సు చేస్తే రెండు లేక మూడు దఫాలుగా వేయాలి.
జిప్సం వేసే విధానం;
పొలాన్ని చిన్న చిన్న మదులుగా చేయాలి. మడి చుట్టూ ఎతైన గట్టు వేసుకోవాలి.
మంచి నీరు పెట్టేందుకు, మురుగు నీరు తీసేందుకు కాలువలను వేరువేరుగా ప్రతి మడికి తయారు చేసుకోవాలి.
ప్రతి మడిలో 15 నుండి 20 సెం.మీ. నిరు పెట్టి బాగా దమ్ము చేయాలి. ఈ విధంగా చేయడం లవణాలు నీటిలో బాగా కరుగుతాయి. చివరకు ఇంకి పోగా మిగిలిన నీటిని మురుగు కాల్వల ద్వారా బయటకు పంపాలి.
బాగా పొడి చేసిన జిప్సం, ప్రతి మదిలో సమానంగా చల్లి నీరు పెట్టి కలియదున్నాలి .
నీటిని మడులలో నాలుగైదు రోజులుమ్చి, ఇంకి పొగ మిగిలిన వాటిని మురుగు కాల్వల ద్వారా బయటకు పంపాలి.
జిప్సం వాడిన తరువాత పచ్చి రొట్ట పైర్లు అనగా జనుము, జిలుగ, పిల్లి పెసర, అలసంద, బర్సిం వేసి అవి పూతకు వచ్చిన పొలంలో కలియ దున్నాలి. దున్నిన తరువాత రెండు మూడు వారలు బాగా మురగానివ్వాలి. తర్వాత మిగిలిపోయిన నీటిని బయటకు పంపాలి.
పచ్చిరోట్టపైర్లు వేయడానికి వీలు కాకపొతే పచ్చి ఆకులూ, ఎండు ఆకులూ, వారి గడ్డి, వారి పొట్టు, వేరుశనగ పొట్టు వేసి మురగ పెట్టవచ్చు.
ఈ విధంగా చేస్తే భూమి గుల్లబారి భు భౌతిక లక్షణాలు మెరుగవుతాయి. అప్పుడు భూమిలోని మొక్కలకు గాలి, నీరు, పోషక పదార్ధాలు బాగా అందుబాటులో వుంటాయి.
వ్యవసాయానికి అనుకూలంగా తాయారు చేసిన నల్లచౌడు భూములల్లో రెండు లేదా మూడు పంటల వరకు చౌడును తట్టుకునే పంటలు అందులో ప్రధానంగా వరి, చెరకు, ప్రత్తి, ఆవాలు, ఉసిరి, నేరేడు, షుగర్ బీట్ , తెల్ల మద్ది, నల్ల తుమ్మ, సరుగుడు, కానుగ మొదలగు అడవి జాతి చెట్లను వేసుకోవచ్చు.
వివిధ భూముల్లో ఉదజని సూచికను బట్టి వేయాల్సిన జిప్సం మోతాదు (కిలో/హెక్టా):
ఉదజని సూచిక ఇసుకతో కూడిన నేలలు గరప నెలలు బంక మట్టితో కూడిన గరప నేలలు
(తేలికపాటి భూములు) (మధ్యస్త నేలలు) (బరువైన భూములు)
8.8 - 75౦ 25౦౦
8.9 75౦ 1750 35౦౦
9.౦ 15౦౦ ౩౦౦౦ 5000