గట్టి పొరలు గల నల్ల భూములు ;

ఈ భూములలో బి హూరైజిన్ లోని బంకమన్ను పొర వున్నప్పుడు అది గట్టి పొరలా ఏర్పడి మొక్కల వేరు పెరుగుదలకు అవరోధంగా వుంటుంది. మురుగు నిరు బయటకు తీసే దానికి కూడా కష్టంగా వుంటుంది.

ఈ భూములు బాగు చేసుకోవాలంటే ట్రాక్టర్లో లేదా ఇనుప నాగలితో బాగా లోతుగా అంటే సుమారు రెండు నుంచి రెండున్నర అడుగుల వరకు దున్నితే లోపలి గట్టిపోర పగిలి, కింద మట్టి పైకి పై మట్టి కిందపడి బాగా కలుస్తుంది. ఆ తర్వాత సేంద్రియ పదార్ధాలు వేస్తె నేల గుల్లబారి, భూ  భౌతిక స్తితి మంచిదిగా మారుతుంది. కాబట్టి రైతు సోదరులు సమస్యాత్మక భూముల లక్షణాలను బట్టి ఆయా భూములను పైన వివరించిన పద్దతుల ద్వారా బాగు చేసుకోవాలి.