నత్రజని ఎరువులు వినియోగంలో మెళకువలు

నైట్రేట్ నత్రజని :  దీనికి భూమి మట్టి రేనువులకు అంటుకొని వుండే శక్తి తక్కువైనందున ఉపయోగ సామర్ధ్యం తక్కువ వుంటుంది. ఇవి ఆరుతడి పైరులకు పై పాటుగా వేసేందుకు బాగా పనికి వస్తాయి. వరిలో వీటి వినియోగం తక్కువ. ఇసుక నేలలకు  అనుకూలం కావు. వీటిలో నత్రజని నీటిలో కరిగి లోపలి పొరల్లోకి పోయి మొక్కకు ఎక్కువ కాలం అందుబాటు కాదు. దుక్కిలోను, వర్షాధారపు పంటలకు వేసేందుకు అనుకూలం కాదు.

అమోనియ  నత్రజని ; అమోనియా లేదా అమోనియగా మారే అమైడ్ భూమిలోని రేనువులకు బాగా అంటి వుండే శక్తి కలిగి ఉన్నందున భూమిలో వేసిన తర్వాత మొక్కకు చాలా రోజుల వరకు అందుబాటులో వుంటుంది. 

      వరికి అమోనియా నత్రజని ఎరువులు నైట్రేట్ నత్రజని ఎరువుల కంటే మేలైనవి. వరి అమోనియా  రూపంలో నత్రజని ఉపయోగించుకుంతుంది. అమోనియా గ లేదా అమోనియం గ మార్పు చెందే అమైడ్ ఎరువులు వరికి శ్రేష్టం. అమోనియం సల్ఫేట్ నత్రజనితో పాటు గంధకాన్ని అందించే మంచి ఎరువు. అమోనియం సల్ఫేట్ నీటిలో కరిగి నష్ట పోవడం తక్కువ. అమోనిం సల్ఫేట్ ఆమ్లాలను పెంచుతుంది. కనుక ఉదజని సూచిక ఎక్కువగా వున్న నేలల్లో వేసేందుకు అనుకూలం.

      సున్నపురాయి ఎక్కువగా వున్న భూములకు అమోనియా సల్ఫేట్ వేస్తే నత్రజని ఎక్కువగా గాలిలో కలిసి వృధా అవుతుంది. దిన్ని లోతులో వేస్తే గాలిలో కలవటం వలన జరిగే నష్టం తగ్గుతుంది.