మిశ్రమ ఎరువులు:

ఎక్కువ పరిమాణం లో కావలసిన నిష్పత్తి లో వివిధ రకాల సూటి ఎరువులు (ఉదా: యూరియా, సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పోటాష్, సున్నము వంటివి) భౌతికం గా  మిళితం చేయడం ద్వారా తయారైయ్యే ఎరువులు మిశ్రమ ఎరువులు అంటారు.

  • ఈమిశ్రమ ఎరువులలో ముడి పదార్ధములను మిశ్రమంలో గుర్తించవచ్చును పంట అవసరం మేరకు ఈ మిశ్రమము లను తయారు చేస్తారు. ఈ ఎరువులలో రెండు లేదా అంత కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి.
  • మిశ్రమ ఎరువులను రైతు స్థాయిలో కొద్ది పరిమాణంలో తాయారు చేసుకొనవచ్చును
  • చిన్న పరిశ్రమలుఎకువ పరిమాణం లో తాయారు చేసి ఎక్కువ మంది రైతులకు అందించవచ్చు .

రైతు స్థాయి మిశ్రమ ఎరువులు

ఏ రసాయనిక ఎరువులు కలపాలో అవి పొరలు పొరలుగా పోసుకొని, బాగా కలియునట్లు  పారలతో కలపాలి.

ఈ మిశ్రమాలను పంటకు వేయబోతే రోజునే కలుపుకోవాలి. నిల్వ యున్నచో గడ్డ కట్టవచ్చు లేదా విష పదార్థంగా మారవచ్చు.

యాంత్రిక మిశ్రమాలు:

  • ఎక్కువ మోతాదులలో వివిధ ఎరువులను యంత్రముల సహాయంతో కలపగా వచ్చే ఎరువులు యాంత్రిక మిశ్రమాలు
  • ఈ పద్ధతి లో ఎరువుల మధ్య రసాయనిక చర్య జరగకుండా ఉండే వాటినే ఎంపిక చేసుకోవాలి.
  • ఆమ్ల లక్షణము కలిగిన కలిగి యున్న ఎరువులను క్షారస్వభావము కలిగిన ఎరువులతో కలపరాదు.
  • ఉదా: అమ్మొనియం సల్ఫేట్ తో బేసిక్ స్లాగ్ కలపరాదు.
  • ఎక్కువ తేమ శాతం కలిగిన ఎరువులు లేదా తేమను పిల్చుకొనే లక్షణం కలిగిన ఎరువులను వాడరాదు.
  • ఉదా: అమ్మోనియం నైట్రీట్, యూరియా
  • మిశ్రమ ఎరువులు ముద్దా కాకుండా చూసుకోవాలి.గుల్లగా ఉండడానికి పొడి చేసిన మొక్కజొన్న కండెలు లేదా కోకో చిప్పలు కలపాలి.
  • గడ్డ కట్టకుండా ఉండేందుకు తక్కువ స్థూల సాంద్రత గల పాటి మట్టిని లేదా సిలికా వంటి పదార్ధాలను కలపాలి.
  • ఒక నిష్పత్తి లో పోషకాల నిమిత్తం వివిధ ఎరువులు వాడేటప్పుడు నేల ఆరోగ్య రక్షణ కొరకు కేవలం రసాయన ఎరువులే కాక సేంద్రియ ఎరువులైనటువంటి నూనె పిండి పదార్ధాలను వాడవలెను.
  • అనుకొన్న మిశ్రమ  పరిమాణము కొరకు ఫిల్లెర్ పదార్ధాలు అయిన ఇసుక, మట్టి, బొగ్గు, బూడిద, సున్నం వాడవలెన.
  • నేల పునరుద్ధరణ దృష్టి లో పెట్టుకొని కొన్ని రసాయనాలు అంటే జిప్సం, సున్నం వంటివి కూడాకలుపుకొనే అవకాశం ఉంది.

సంకీర్ణ ఎరువులు:

  • సంకీర్ణ రసాయనిక ఎరువులలో రెండు లేక మూడు ప్రధాన పోషకాల రసాయనం గా కలిసిన రూపంలో ఉంటాయి.
  • పోషక పదార్ధలు ఎక్కువ శాతం లో ఉంటాయి.
  • అందువలన సూటి ఎరువులతో పోల్చి చూస్తే ప్యాకింగ్, గోదాము, రవాణా ఖర్చులు చాల తక్కువ.
  • సాధారణంగా గుళికల రూపంలో ఎన్నో మంచి బౌతిక లక్షణాలు ఉంటాయి. కనుక కావలసినంత మేరకే పొలం లో చల్లుకోవడానికి వీలవుతుంది.
  • పోషక పదార్ధాలన్నీ ప్రతి మొక్కకు సమానంగా అందుతాయి.
  • తేమను తొందరగా పిల్చు కోవు, చల్లడం సులువు.
  • సంకీర్ణ ఎరువులు మూడు రకాలు- 1.అమ్మోనియం ఫాస్ఫేట్, 2.నైట్రో ఫాస్ఫేట్, 3.న-భా-పొ సంకీర్ణ ఎరువులు
  • సంకీర్ణ ఎరువులు నత్రజనితో బాటు,భాస్వరం ఒకే సరి మొక్కలకు అందడం వల్ల పైర్ల కెంతో మేలు జరుగుతుంది.
  • కొన్ని పైర్లకు నత్రజని కంటే భాస్వరం అదికంగా కావలసి వస్తుంది. పుష్ప జాతి పంటలు, అప్పుడు డిఎపి ఎంతో బాగా పనిచేస్తుంది.
  • డిఎపి క్షార నేలలో, సున్నపు నేలల్లో బాగా పనిచేస్తుంది.
  • న-భా-పొ సంకీర్ణ ఎరువులు మార్కెట్ లో చాల ఉన్నాయి.
  • 10-26-26
  •  

        14-35-14

        14-28-14

        17-17-17

        19-19-19

సంకీర్ణ ఎరువుల వినియోగంలో మెళకువలు;

ఒకటి కంటే ఎక్కువ పోషకాలందిం చే రసాయనిక సమ్మేళన  ఎరువును సంకీర్ణ ఎరువులు అంటారు.

కొన్నింటిలో రెండు పోషకాలు (డి.ఎ.పి, 28;28, 16;20, 20;20) మరి కొన్నింటిలో మూడు పోషకాలు (15:15:15, 17;17;17, 19:19:19) వుంటాయి.

సంకీర్ణ ఎరువులను చాలా పంటలకు దుక్కిలో వేయాలి. వీటిని పై పాటుగా వేయడం లాభసాటి కాదు.

దీర్ఘకాలిక పంటలకు, బహు వార్షిక వేర్ల దగ్గర వేసే మట్టిని కప్పాలి.

ఎక్కువ భాగం నైట్రేట్ ఉన్న సంకీర్ణ ఎరువులను ఆరుతడి పంటలకు దుక్కిలో వేయకూడదు.

సంకీర్ణ ఎరువులకు ప్రత్యామ్నయంగా సూటి ఎరువులు వాడకం. పంటలకు స్థూల పోషకలైన నిర్ణీత మోతాదుల్లో నత్రజని, భాస్వరం, పోటాష్ లను వేయాలి.

సంకీర్ణ ఎరువులో పంటకు అవసరమైన మోతాదులో నత్రజని, భాస్వరం, పోటాష్ పోశాకలందాక పోవచ్చు.

సూటి ఎరువులైన యూరియా, సింగల్ సూపర్ ఫాస్ఫాట్ పోషకా లందక పోవచ్చు.

సూటి ఎరువులైన యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యురేట్ ఆఫ్ పోటాష్ లను అవసరం మేర కలుపుకొని కావలసిన మోతాదుల్లో తక్కువ ఖర్చులో పోషకాలను పైర్లకు వేయవచ్చు.