నత్రజని ఎరువులు:
ఎరువులో రసాయన రూపాన్ని బట్టి (నైట్రైట్, అమ్మోనియా, ఎమైడ్) నత్రజని ఎరువులు 4 రకాలు
- నైట్రైట్ రసాయనిన ఎరువులు
- అమ్మోనియా రసాయనిన ఎరువులు
- నైట్రైట్-అమ్మోనియా రసాయనిన ఎరువులు
- ఎమైడ్ రసాయనిన ఎరువులు
ఎ.నైట్రైట్ నత్రజనిఎరువులు:
- నేలలోగల తేమ వలన త్వరగా కరిగి నత్రజనిని నైట్రైట్ రూపంలో మొక్కలకు అందిస్తుంది.
- నైట్రైట్ రూపంలో గాల నత్రజనిని మట్టి రేణువులు పట్టిఉంచలేవు. అందువలననీటిలోకరిగినేల అడుగు పోరలోనికి పోవడం, మరియు సూర్య రశ్మి వలన వాయువుగా మరి గాలిలో కలిసిపోతుంది.
- సాగు నీటి క్రింద చేపట్టే వరిపైరుకుఈ ఎరువును వాడరాదు.
ఉదా: కాల్షియం నైట్రైట్ (15% N), సోడియం నైట్రైట్(16% N)
బి.అమ్మోనియా నత్రజని ఎరువులు:
- ఈ ఎరువులలో నత్రజని అమ్మోనియా రూపంలో మొక్కలకుఅందజేయబడుతుంది.
- అమ్మోనియా రూపం లో గల నత్రజని నైట్రైట్ రూపం వాలె వృధా కాదు. అందువల్ల మొక్కలు బాగా వినియోగించుకుంటాయి కాబట్టి ఈ ఎరువులను మంచి ఎరువులు గ భావించ వచ్చు
- అమ్మోనియా సల్ఫేట్ వితనoవేసేటప్పుడు గాని, ఫై పాటుగా గాని వేసుకోవచ్చ. కానీ వితనం తో కలిపి వాడకూడదు.
- అమ్ల గుణం కనిపించే స్వభావం కలది కాబట్టి మరి ఎక్కువగా అమ్మోనియా సల్ఫేట్ వాడకూడదు.
- మాగాణి పైరుకు వేసుకోవచ్చు.
- పోగాకు, ఆలుగడ్డ పైరుకు అమ్మోనియా క్లోరైడ్ ను వాడకూడదు.
ఉదా: అమ్మోనియా సల్ఫేట్ (21% N, 24% S), అమ్మోనియా క్లోరైడ్ (25% N)
సి.నైట్రైట్-అమ్మోనియా ఎరువులు:
- ఈ ఎరువులలో కొంత నత్రజని నైట్రైట్ రూపంలోనుమిగిలినది అమ్మోనియా రూపంలోనూ ఉంటుంది.
- ఆరుతడి పంటలలో ఈ ఎరువును వడినప్పుడు నైట్రైట్ రూపంలో ఉన్నానత్రజని మొక్కలకుత్వరగాఅందించబడి అమ్మోనియా రూపంలో నత్రజని నెమ్మదిగా మొక్కలకు అందించబడుతుంది.
ఉదా: అమ్మోనియా నైట్రైట్ (33% N), కాల్షియం అమ్మోనియా నైట్రైట్ (20.5% N), అమ్మోనియా సల్ఫేట్ నైట్రైట్ (26% N).
డి.ఎమైడ్ నత్రజని ఎరువులు:
- నత్రజనిఎమైడ్లేదా సైనమైడ్ రూపం లో వుంటుంది.
- ఎమైడ్ నత్రజని ఎరువులలో యూరియా ప్రాచుర్యం పొందిన ఎరువు.
- గాలి లో తెమే బాగా పిల్చి త్వరా గడ్డ కడుతుంది.
- మాగాణిలో వేసేటప్పుడుకొంత నత్రజని కొట్టుకుపోవచ్చు. మెట్ట లో కూడా పై పొరలో ఉన్న నత్రజని ఆవిరై నష్టం కావచ్చు కాబట్టి యూరియా వేసేటప్పుడు అది నెలలో బాగా కలిసేటట్లు జాగ్రత్త పడాలి.
- ఈ ఎరువును నీటిలో కరిగించి మొక్కల పై పిచికారి చేసిన నత్రజని శీగ్ర గతిని మొక్కలు తీసుకుంటాయి (20 గ్రా.లు లీటరు నీటిలో).
ఉదా: యూరియా (46% N)