భాస్వరం ఎరువులు:

భాస్వరం లభ్యమైయే రూపాన్ని బట్టి మరియు కరిగే స్వభావాన్ని బట్టి భాస్వర ఎరువులను వర్గీకరించారు.

ఎ.నీటిలో కరిగే భాస్వర ఎరువులు

బి.సిట్రిక్ అమ్లములో కరిగే భాస్వర ఎరువులు

సి.కరగని భాస్వర ఎరువులు

ఎ.నీటిలో కరిగే భాస్వర ఎరువులు

  • ఈ ఎరువులు నీటిలో కరిగిన వెంటనే భాస్వరాన్ని మొక్కకు అందజేస్తాయి.
  • ఈ ఎరువులు అన్ని నేలల్లోనూ తటస్థ మరియు క్షార స్వభావము కలిగిన నీలలో వాడవచ్చు.

ఉదా: సింగల్ సూపర్ ఫాస్ఫేట్ (16% P2O5), డబుల్ సూపర్ ఫాస్ఫేట్ (32% P2O5), ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ (48% P2O5)

  • సింగల్ సూపర్ ఫాస్ఫేట్ భాస్వరం (16%) తో బాటు కాల్షియం (21%), గంధకం(12%) వుంటాయి. కొన్ని సూక్ష్మ పోషక పదార్ధాలు కూడా ఈ ఎరువులో ఉంటాయి. అందువల్ల ముఖ్యంగా వేరు శెనగ పంటకు ఇది వేస్తారు.
  • ఎప్పుడు వితానం నటేటప్పుడు భాస్వర ఎరువులు వేసుకోవాలి. ఆరు తడి పంటలు వేసేటప్పుడు మొక్కలను 2 సెం.మీ దూరం లో 4-8 సెం.మీ లోతున వేసుకొంటే మంచి ఫలితమిస్తుంది.

బి.సిట్రిక్ అమ్లములో కరిగే భాస్వర ఎరువులు:

ఉదా: బేసిక్ స్లాగ్ (16% P2O5)- బేసిక్ స్లాగ్ పొడి ఆమ్ల భూముల్లోచల్లితే ఆమ్లత్వం తగ్గుతుంది),

బోన్ మీల్ (20-25% P2O5)

సి.కరగని భాస్వర ఎరువులు:

అత్యధిక ఆమ్లత్వం కలిగిన నేలల్లో ఈ ఎరువులు కరిగి భాస్వారాన్ని మొక్కలకు అందిస్తాయి.

ఉదా: శిలా ఫాస్ఫేట్ (20-40% P2O5)

భాస్వరం ఎరువుల వినియోగంలో మెళకువలు:

 భాస్వరాన్ని వేర్లకు దగ్గరగా వేయాలి. ఈ పోషకానికి భూమిలో చలనం చాలా తక్కువ. భాస్వరాన్ని పై పాటుగా భూమిపై చల్లితే వృధా కావడమే కాకుండా జింకు, మేగ్నిసియం లోపాన్ని కూడా కలుగ చేస్తుంది.

నీటిలో కరుగు భాస్వరం తొందరగానూ మొక్కలకు అందుబాటులోనికి వస్తుంది.

నీటిలో కరుగు భాస్వరం గల ఎరువులు తటస్థ భూములకు, సిట్రేట్ లో కరిగే భాస్వరం గల ఎరువులు ఆమ్ల  భూములకు అనుకూలం.

తక్కువ కాల పరిమితి గల పంటలకు, తక్కువ వేరు వ్యవస్థ వున్న పంటలకు ఎక్కువగా నీటిలో కరిగే భాస్వరం వున్న యూర్వులు వాడటం మంచిది.

ఎక్కువ కాల పరిమితి వున్న పంటలకు నీటిలో కరిగే భాస్వరం వున్న ఎరువులు అంతా ప్రాముఖ్యం కాదు. వీటికి సిట్రేట్ కరిగే భాస్వరం వున్న ఎరువులు కూడా వేయవచ్చు.

మొక్కల పెరుగుదల వెంటనే జరగల్సినప్పుడు నీళ్ళలో కరిగే భాస్వరం వున్న ఎరువులు వాడాలి. తక్కువ పరిమాణంలో భాస్వరాన్ని వేసినప్పుడు, నీటిలో కరుగు భాస్వరం ఎరువులను ఒకే స్తలంలో వేయాలి.

నూనే గింజ పంటలైన వేరుశనగ, పొద్దు తిరుగుడు, అవలుతో పాటు వరికి గంధకం కలిగిన సూపర్ ఫాస్ఫేట్ (12శాతం), అమోనియా సల్ఫేట్ (23.7 శాతం), పోటాష్యం సల్ఫేట్ (18 శాతం) చాలా అనుకూలం.