మిశ్రమ ఎరువులు:
ఎక్కువ పరిమాణం లో కావలసిన నిష్పత్తి లో వివిధ రకాల సూటి ఎరువులు (ఉదా: యూరియా, సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పోటాష్, సున్నము వంటివి) భౌతికం గా మిళితం చేయడం ద్వారా తయారైయ్యే ఎరువులు మిశ్రమ ఎరువులు అంటారు.
రైతు స్థాయి మిశ్రమ ఎరువులు
ఏ రసాయనిక ఎరువులు కలపాలో అవి పొరలు పొరలుగా పోసుకొని, బాగా కలియునట్లు పారలతో కలపాలి.
ఈ మిశ్రమాలను పంటకు వేయబోతే రోజునే కలుపుకోవాలి. నిల్వ యున్నచో గడ్డ కట్టవచ్చు లేదా విష పదార్థంగా మారవచ్చు.
యాంత్రిక మిశ్రమాలు:
సంకీర్ణ ఎరువులు:
14-35-14
14-28-14
17-17-17
19-19-19
సంకీర్ణ ఎరువుల వినియోగంలో మెళకువలు;
ఒకటి కంటే ఎక్కువ పోషకాలందిం చే రసాయనిక సమ్మేళన ఎరువును సంకీర్ణ ఎరువులు అంటారు.
కొన్నింటిలో రెండు పోషకాలు (డి.ఎ.పి, 28;28, 16;20, 20;20) మరి కొన్నింటిలో మూడు పోషకాలు (15:15:15, 17;17;17, 19:19:19) వుంటాయి.
సంకీర్ణ ఎరువులను చాలా పంటలకు దుక్కిలో వేయాలి. వీటిని పై పాటుగా వేయడం లాభసాటి కాదు.
దీర్ఘకాలిక పంటలకు, బహు వార్షిక వేర్ల దగ్గర వేసే మట్టిని కప్పాలి.
ఎక్కువ భాగం నైట్రేట్ ఉన్న సంకీర్ణ ఎరువులను ఆరుతడి పంటలకు దుక్కిలో వేయకూడదు.
సంకీర్ణ ఎరువులకు ప్రత్యామ్నయంగా సూటి ఎరువులు వాడకం. పంటలకు స్థూల పోషకలైన నిర్ణీత మోతాదుల్లో నత్రజని, భాస్వరం, పోటాష్ లను వేయాలి.
సంకీర్ణ ఎరువులో పంటకు అవసరమైన మోతాదులో నత్రజని, భాస్వరం, పోటాష్ పోశాకలందాక పోవచ్చు.
సూటి ఎరువులైన యూరియా, సింగల్ సూపర్ ఫాస్ఫాట్ పోషకా లందక పోవచ్చు.
సూటి ఎరువులైన యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యురేట్ ఆఫ్ పోటాష్ లను అవసరం మేర కలుపుకొని కావలసిన మోతాదుల్లో తక్కువ ఖర్చులో పోషకాలను పైర్లకు వేయవచ్చు.
Severity: Notice
Message: Only variables should be passed by reference
Filename: helpers/ckeditor_helper.php
Line Number: 65
Line Number: 151
Line Number: 158
Line Number: 108
Line Number: 116