తల్లి పురుగు
2 - 3 రోజుల కోశాస్థ దశ తరువాత రెక్కల పురుగు బయటికి వస్తుంది. జూలై – ఆగష్టు మధ్య కాలంలో ఈ పురుగు బాధ ఎక్కువగా ఉంటుంది.
రెక్క పురుగు నెల నుంచి రెండు నెలల వరకు బతుకుతుంది. మొత్తంగా 17 – 50 రోజుల లోపల జీవిత చక్రం పూర్తవుతుంది.
తల్లి పురుగు చిన్న సైజులో గుండ్రంగా లేదా కొంచెం చతురస్రాకారంగా ఉంటుంది. 5 మిల్లి మీటర్ల పొడవు, 3.5 మిల్లి మీటర్ల వెడల్పు ఉంటుంది.
పురుగు శరీరం కింద భాగం సమతలంగానూ, పై భాగం వంపు తిరిగి ఉంటుంది.
ఇది తేలికపాటి ఇటుక రంగు లేదా గులాబీ రంగులో ఉండి, పైన ఉండే రెక్కల పైన 12 – 28 చుక్కలు ఉంటాయి. ఈ చుక్కలు అర్ధ చంద్రాకారంలో, వరుసలుగా పేర్చబడి ఉంటాయి.