తల్లి పురుగు:

పెద్దగా మారిన రెక్కల పురుగు ఎక్కువగా ఉదయం 7 గంటలనుంచి 10 గంటల మధ్య వస్తుంది.

ఆడ పురుగు 7 రోజులు బతుకుతుంది. మగ పురుగు 17 రోజుల వరకు జీవిస్తుంది.

రెక్కల పురుగులు రోజంతా చురుకుగా ఉంటాయి.

ఒక తల్లి పురుగు తన జీవిత కాలంలో 240 గుడ్లు పెడుతుంది. 

రెక్కల పురుగు  4 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది.

ఇండ్లలో తిరిగే చిన్న  ఈగ మాదిరిగా ఉంటుంది.

ఆడ పురుగు తల, గొంతు భాగం బూడిద రంగులో ఉంటుంది. కడుపు భాగం పసుపు రంగులో ఉండి, దానిపై జతలుగా గోధుమ రంగు మచ్చలు కనపడతాయి.

మగ పురుగు ఎక్కువగా  నల్లగా ఉంటుంది.