పిల్ల పురుగు (లార్వా) దశ:
గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకు కింది భాగపు ఉపరితలం మీద నుంచి మెల్ల మెల్లగా లేత మొక్క అడుగు భాగానికి చేరతాయి.
పెరిగే భాగాలను, ప్రధానమైన కొమ్మ భాగాలను నాశనం చేస్తాయి.
చివరకు మొక్క ఎదగకుండా చేస్తాయి.
పురుగు సోకిన మొక్క ఆకు గోధుమ రంగులోకి మారి వడలినట్లు కనపడుతుంది.
పూర్తిగా ఎదిగిన లార్వా 8 – 10 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది. తెలుపు లేదా పసుపు రంగులో ఉంటుంది.
ఈ దశలో 8-10 రోజుల పాటు గడుపుతుంది.