దీని శాస్త్రీయ నామం అంతేరిగోన ఒరిఎంతలిస్ లేదా అంతేరిగోన సోక్కేట

ప్రధానంగా దక్షిణ భారత దేశంలో మొక్క జొన్న పంటను ఆశించే పురుగు ఇది. వేసవి, చలి కాలంలో ఉత్తర భారత దేశంలో కూడా పంటను ఆశిస్తుంది. ఎక్కువగా మొలక దశలో పంటను నాశనం చేస్తుంది.

మార్చి – డిసెంబర్ మధ్య కాలంలో వస్తుంది.   మొక్క జొన్నతో పాటు జొన్న, చిరు  ధాన్యాలు, గడ్డి జాతి మొక్కలను కూడా ఆశిస్తుంది.  

పురుగు జీవిత చక్రం

పురుగు మొత్తం జీవిత కాలం 17-21 రోజుల పాటు ఉంటుంది

జీవిత చక్రంలో నాలుగు దశలు ఉంటాయి, అవి  గ్రుడ్డు , పిల్లపురుగు (లార్వ) , కోశాస్త మరియు తల్లి పురుగు దశలు