తల్లి పురుగు
కోశాస్థ దశకు వెళ్ళిన తరువాత 6 – 8 రోజుల లోపల రెక్కల పురుగు బయటికి వస్తుంది. ఆడ, మగ పురుగులు కలిసే దశ ఇది. అయితే ఈ దశలో పురుగు పంటకు ఏ మాత్రం నష్టం చేయదు.
తల్లి పురుగు సైజు మధ్యస్తంగా ఉంటుంది. తెల్లటి రెక్కలుంటాయి. వాటిపై పెద్ద సైజులో గోధుమ రంగు మచ్చలు, ఎర్రటి గుర్తులు మాదిరి ఉంటాయి.
రెక్కల నిడివి 3/4 అంగుళం మేర ఉంటుంది. తల, గొంతు భాగం నలుపు గోధుమ రంగులో ఉంటాయి.