పంచ గవ్య:
తయారుచేసే పద్దతి
5 కిలోల ఆవుపేడను, అర కిలో (5౦౦ గ్రాముల) చల్లార్చిన ఆవు నెయ్యిని ఒక కుండలో తీసుకొని చేతితో బాగా కలపాలి. ఒక తడి గుడ్డతో కప్పి నాలుగు రోజులు ఉంచాలి. ప్రతిరోజూ ఒకసారి చేతితో కలపాలి. నాలుగు రోజులకు పెదలో నెయ్యి పూర్తిగా కరుగుతుంది.
5 వ రోజున ఈ కుండలో
5 లీటర్ల ఆవు మూత్రం, 2 లీటర్ల ఆవు పాలు, 2 లీటర్ల ఆవు మజ్జిగ, అర కిలో (5౦౦ గ్రాముల) బెల్లం (ఆర్గానిక్ బెల్లం వాడితే మంచిది), అందుబాటులో ఉంటె ౩ లీటర్ల లేత కొబ్బరి బొండం నీరు, 10 నుంచి 12 కుళ్ళిన అరటి పండ్లు, 2 లీటర్ల కల్లు (తాటి లేక ఈత, బిళ్ళలు కలపనిది) బాగా కలిపి 15 రోజుల పాటి ఉంచాలి. ప్రతిరోజూ ఉదయం, మద్యాహ్నం, సాయంత్రం తప్పనిసరిగా చేతితో బాగా కలపాలి.
16 వ రోజు నుంచి
6 నెలల పాటి దీనిని వాడుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ప్రతిరోజూ ఒకసారి కలపాలి.
ఉపయోగించె విధానం
సుమారుగా పావు లీటరు (25౦ మీ.లి.) పంచగవ్య ను 10 లీటర్ల నీటిలో కలపాలి. పొలానికి తగ్గట్టుగా 200-౩౦౦ లీటర్ల ద్రావణం చల్లాలి. పొలానికి నీరు పెట్టేటప్పుడు ఒక ఎకరానికి 5 నుంచి 20 లీటర్ల పంచగవ్యను చేను మొదట్లో కలిపి ఇవ్వవచ్చు.
ఉపయోగాలు