పచ్చి రొట్ట పైరు:

పంటను సాగు చేయుటమంటే ప్రధానంగా వాటికి కావలసిన పోషక పదార్ధాలు అందచేయటమని అనుకుంటాం. అయితే వ్యవసాయమంటే భూమి సారాన్ని కాపాడుకోవటమని, భూమి లోని కోట్లాది చిన్న, పెద్ద జీవులకు పోషకాలను అందిచటమని ఒక ఆలోచన విధానం ఉంది.  ఈ దృష్టి చూస్తే నేల సజీవమైంది . దీనిలోని కోట్లాది చిన్న, పెద్ద జీవులకు సేంద్రియ పదార్దమే ఆహరం. 

నేలలోని జీవులకు ఆహారాన్ని అందించే మార్గాలు ప్రధానంగా నాలుగు రకాలు:

  • పెంటపోగు
  • వానపాముల ఎరువ
  • పచ్చి రొట్ట పైరుల సాగు
  • మల్చింగ్

ఇక్కడ పచ్చి రొట్ట పైరుల సాగు, నేలను కప్పి ఉంచే పంటలు గురించి తెలుసుకుందాం

పచ్చి రొట్ట పైరుల సాగు

పచ్చి రొట్ట పైరులగా పప్పుజాతి (లేగ్యుమ్) రకాలను సాగు చేస్తారు.  పప్పు జాతి పైరులు తమ వేళ్ళలోని బుడిపెలలోని సుక్ష్మ జీవుల (రైజోబియా) ద్వారా గాలిలోని నత్రజనిని నెలలో స్థిరికరిస్తాయి.  పప్పుజాతి పైరులకు ఆకులు ఎక్కువ ఉంటాయి.  వీటిని నేలలోకి కలియ దున్నినపుడు ఎక్కువ సేంద్రియ పదార్ధం నేలలోకి చేరుతుంది.

ఉపయోగించే విధానం

పచ్చి రొట్ట పైరును 45-60 రోజుల పాటు (పంట 50 శాతం పూత మీద ఉండాలి)  సాగుచేసి నెలలో కలియ దున్నాలి.  కాండం ముదిరితే కుళ్ళడానికి చాలా సమయం పడుతుంది.  పచ్చి రొట్ట పైరు తొందరగా కుల్లిపోవడానికి ఎకరానికి 50 కిలిలు సూపర్ ఫాస్పేట్ చల్లాలి.  నీళ్ళు నిల్వ గట్టాలి.  పచ్చి రొట్ట పైరును నేలలోకి కలియ దిన్నన తరువాత అది కుళ్ళి పోవటానికి 2,౩ వారాలు పడుతుంది.  సేంద్రియ పదార్ధాన్ని కుళ్ళేలా చెయ్యాటానికి సుక్ష్మ జీవులకు శక్తి అవసరమవుతుంది.  కాబట్టి ఈ సమయంలో ఇతర పంటలు ఏవి పండించకూడదు.  పచ్చి రొట్ట పైరు పూర్తిగా కుళ్ళి పోయిన తరువాత ప్రధాన పంట సాగుచేస్తే దానికి పోషక పదార్ధాలు అందుబాటులోకి వస్తాయి.

పచ్చి రొట్ట పైరుకు దబోల్కర్ పద్ధతి.

పైన పేర్కొన్న విత్తనాలన్నింటిని కలిపి వరసగా మూడుసార్లు పచ్చిరొట్ట పైరుగా సాగుచేసే పూర్తిగా నిస్సారమైన నేలలను సారవంతం చేయవచ్చు.  పచ్చి రొట్ట పైరు సాగు చేసే రోజులు

మొదటి పైరు :                    40 రోజులు

రెండవ పైరు:                      60 రోజులు

మూడవ పైరు                     90

ఈ విధంగా ఒక సంవత్సర కాలంలో నేలను తిరిగి సారవంతం చేయవచ్చు.  ఇలా చెయ్యాలంటే పచ్చి రొట్ట పైరు సాగు చెయ్యటానికి, మురగాబెత్తటానికి, నీటి వసతి ఉండాలి.

వర్షాధార పంటలలో పచ్చి రొట్ట పద్ధతి

వర్షధార పంట లైన బోజకంది, పట్టి, ఆముదం వంటి పంటలలో ఉలవలు పచ్చి రొట్ట పంటగా సాగు చేయవచ్చు.  ప్రధాన పంట విత్తిన తరువాత 45 రోజులకు/లేదా మొదటి కలుపు తీసిన తరువాత ఎకరానికి 6 కిలోల చొప్పున ఉలవ విత్తనం చల్లాలి/సాలులో వెయ్యవచ్చు. ఉలవ విత్తిన 40-45 రోజులకు కలియదున్నాలి/ రోప్పాలి.  ఇలా చేస్తే ఎకరాకు ఒక టన్ను నుండి ఒక టన్నున్నర వరకు బయోమాస్ ను నెలలో కలపవచ్చు.  ఈ విధానాన్ని కరువు కవచం కార్యక్రమమంలో మహబూబ్ నగర్ జిల్లాలో డి.ఫ్.ఎస్. రైతులు గత మూడు సంవత్సరాలుగా చేస్తున్నారు.  ఈ విధంగా పచ్చి రొట్ట సాగు చేస్తే ఆముదం పంటలో రెండవ దశ కొతలో 50% పంట దిగుబడి పెరిగింది.  కంది పంట పూత దశలో తేమను నిల్వ ఉంచడం వల్ల విత్తనాలు నిండుగా వచ్చి దిగుబడి 25% పెరిగిందని రీతులు తెలియచేశారు.

నేలను కప్పి ఉంచే పంటలు

పండ్ల తోటలు వంటి వాటిల్లో మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు అంతర పంటలు పండిస్తారు.  కొంతకాలం తరువాత చెట్లు పెద్దవయ్యి పంటలు తీసుకోటానికి వీలుకాదు.  అదే సమయంలో కొంత స్థలం ఖాళీగా ఉంటుంది. దీనిని కప్పి ఉంచటానికి కొన్ని రకాల పంటలను సాగు చేయవచ్చు.   స్టైలో పశువులకు మంచి మేత.  దీనిని సేంద్రియ ఎరువుకి ఉపయోగించ వచ్చు.  లేదా నేలలోకి కలియ దున్నవచ్చు.

పచ్చి రొట్ట పైరు వల్ల ఉపయోగాలు

ఇతర పద్దతుల్లో సాద్యం కానంత తేలికగా పచ్చి రొట్ట పైరు ద్వారా నెలకు ఒకేసారి ఎక్కువ మోతాదులో సేంద్రియ పదార్ధం అందుతుంది. ముందు నేల మెత్తగా అయ్యి గుల్లబారుతుంది.  దీనివల్ల నెలకి నీటిని పట్టి ఉంచే శక్తి, అడనపు నీటిని బయటకు తీసివేసే శక్తీ పెరుగుతాయి.  నెలలో నత్రజని శాతం పెరుగుతుంది. ఉదజని సూచిక (ఫై.హెచ్ ) వంటి రసాయనిక గుణాలు మెరుగుపడతాయి. సుక్ష్మ జీవుల సంఖ్య పెరిగి వాటి చర్యలు వృద్ది చెందుతాయి.