చెల్కలో ఎరువు తయారి

ఎరువు గుంత పద్ధతి:

భూసారం పెంచే వాటిలో ముఖ్యమైనది పెంట ఎరువు.  సాదారణంగా రీతులు పశువుల కొట్టం దగ్గర పెంట ఎరువు చేస్తారు.  నానాటికి పశువుల సంఖ్య  తగ్గటం వల్ల పెంట ఎరువు దొరకడం తగ్గుతుంది.  ఉన్నకొద్ది ఎరువును నిటి ఆధార పొలాల్లో వేయడానికి రీతులు ప్రాధాన్యతనిస్తున్నారు.  అందువల్ల వర్షాధార భూమిలో (చెల్కలలో) పెంట ఎరువు వేయడం చాలావరకు తగ్గిపోయింది.  చెల్కలు అసలే సారం తక్కువ నేలలు.  ఎరువు అందుబాటులో లేకపోవడం వల్ల నేలలో తేమ నిలుపుకునే శక్తి తగ్గుతుంది.  దీంతో వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ కాలం ఎడం వేస్తె పంట దిగుబడులు తగ్గి రీతులకు నష్టం జరుగుతుంది.  ఈ పద్దతిని అధిగమించడానికి తక్కువ పేడతో చెల్క లోనే ఎరువు తయారీ చేసే పద్దతులు అవలంబించాలి. ఇందులో ఎరువు గుంత పద్ధతి ఒకటి.

ఈ పద్ధతిలో కేవలం 10 గంపల (50 కిలోల) పేడతో రెండు తన్నల ఎరువు తయారు చేయవచ్చు.  ఒక సంవత్సరంలో రెండు నుండి మోడుసార్లు ఎరువు అందుతుంది.  అంటే సంవత్సరానికి ఆరు టన్నుల ఎరువు చెల్కకు వేయవచ్చు.

ఎరువు గుంత వల్ల ఉపయోగాలు

గుంత పద్దతిలో ఎరువు తయారీలో పనులు

  1. ఎకరాకు ప్రతి సంవత్సరం రెండు టన్నుల ఎరువు వేసినట్లయితే నెలలో నీరు నిలుపుకునే శక్తి మూడు రెట్లు పెరుగుతుంది.
  2. పంట దిగుబడి పెరిగి ఖర్చు తగ్గుతుంది.
  3. రసాయనిక ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు
  4. పంట ఆరోగ్యంగా పెరగడం మూలంగా చీడ పిడలను తట్టుకుంటుంది.
  5. చెల్కలోనే ఎరువు తయారు చేయటం వల్ల రవాణా ఖర్చు తగ్గుతుంది
  6. దీనికి పెట్టుబడి శ్రమ మాత్రేమే
  • గుంత తయారి,  గుంత చుట్టూఎరువాకు చెట్ల పెంపకం
  • చెత్త, పేడ జమ చేయడం, (ఎండు చెత్త రెండు ట్రాక్టర్ల మందం, పచ్చి ఆకు పొరక 5 మోపులు)
  • పెడ పది గంపలు
  • ఎరువు కుప్ప వేయడం
  • కుప్ప తిరగ వేయడం
  • ఎరువు తీయడం, నిలవ చేయడం

 

గుంత తయారి

ప్రతి ఎకరా చెల్కకు ఒక ఎరువు గుంత తీసుకోవచ్చు. చెట్టు నీడలో లేదా చెల్క లోని నీరు బయటికి పోయే దగ్గర అయితే అనుకూలమైన స్థలం, కాలువలు, ఎక్కువ వరద వచ్చే స్థలాలలో భూగర్భ జలాలలు పై పైనే ఉండే దగ్గర గుంత ఏర్పాటు చేయకూడదు.  నీరు ఎక్కువగా ఉంటే చెత్త కుళ్ళ కుండ చాల రోజులు అలాగే ఉంటుంది.

గుంత కోసం 4 మీటర్ల పొడవు, ౩ మీటర్ల వెడల్పు, అర్ధ మీటరు లోతు తవ్వాలి.  తవ్విన మట్టిని (గుంత లోకి నీరు రావడానికి రెండు మీటర్ల స్థలం వదిలి) చుట్టూ కట్టగా పోయాలి.  కట్టకూ గుంతకూ మధ్య రెండు అన్దుగుఅల స్థలం వదిలి మట్టి పోయాలి.  దగ్గరగా పోస్తే కట్టకు పోసిన మట్టి గుంతలోకి జారిపోతుంది.

గుంత దగ్గర చెత్త అందుబాటులోకి తీసుకు రావడానికి గుంత చుట్టూ ఎరువాకునిచ్చే చెట్లను నాటాలి. గ్లైరిసిడియా, అడవి తంగేడు (కాసియా సయామియా ) లేదా కానుగ మొక్కలను నాటవచ్చు.  గుంత చుట్టూ కట్టపైన రెండు వరసలలో అర్ధ మితరుకు ఒకటి చొప్పున 50 నుండి 60 మొక్కలను నాతుకోవచ్చు. ఈ చెట్లు పెద్దవి అయితే గుంతకు కావలసిన పచ్చి చెత్త గుంత దగ్గరే దొరికే శ్రమ ఖర్చు తగ్గుతుంది.  చెల్క చుట్టూ గట్లపైన కూడా ఇలాంటి మొక్కలను నాటవచ్చు.

చెత్త జమ చేయడం

చెల్క లోని పంట కొయ్యలను, కలుపు తీసిన కుప్పలను జమ చేయవచ్చు.  వర్ష కాలంలో అయితే ఎక్కడ పడితే అక్కడ కలుపు గడ్డి, ఆలం విపరీతంగా దొరుకుతుంది.  ఇది కూడా సేకరించవచ్చు. ఇలాంటి చెత్త రెండు ట్రాక్టర్ల మందం అవసరమవుతుంది.  పచ్చి ఆకు చెత్త, కానుగ ఆకును గాని గ్లైరిసిడియా ఆకును గాని జిల్లెడి ఆకును గాని సేకరించవచ్చు.  ఈ పచ్చి ఆకు మొత్తం 5 మోపులుంటే వరుసకింత వేయవచ్చు.

పేడ:

పసువులున్న వారు అయితే ఇంటి దగ్గర గాని, చెల్కల్లో గాని పేడను 10 గంపలు జమ చేసుకోవాలి.  పశువులు లేనివారు అడవిలో పశువులు తిరిగే దగ్గర పేడ సేకరించవచ్చు.

ఎరువు కుప్ప వేయడం

ఎండు/ పచ్చి చెత్తను ఒక అడుగు మందం వరసలో పరవాలి.  పచ్చి పొరక రెండు అంగుళాల  మందం సరిపోతుంది.  ఒక బకెట్ లో పేడ నీళ్ళు కలిపి చెత్త వరసపైన చల్లాలి.  చెత్త తడిచే విధంగా 5,6 బిందెల నీళ్ళు చల్లాలి. ఈ విధంగా చేయడం వల్ల  పేడ నీళ్ళు చేత్తనంతటిని తాకి తొందరగా కుళ్ళడానికి  అవకాశం ఉంటుంది. తరువాత చెత్త వరస మీద నేలపై మట్టిని 4-5 గంపలు కుప్పచేసి అర్ధ అంగుళం మందం పొరలో చల్లాలి.  మట్టిలో వున్నా సుక్ష్మ జీవులు చెత్తను తొందరగా కుళ్ళే విధంగా చేస్తాయి.  అంతేకాకుండా మట్టి తేమను పట్టుకుని ఉంటుంది.  తరువాత చెత్త వరుసను తొక్కుతూ గట్టి పరచాలి.

ఈ విధంగా మొత్తం అయుదు వరసల వరకు వేయాలి.  గుంత మధ్యలో ఒక కట్టెను/ గుంజను పాతాలి.  పై వరుసలో మట్టిని రెండు అంగుళాల మందం వేయాలి.  దీని వల్ల తేమ తొందరగా ఆరకుండా ఉంటుంది.  నీటి అవసరం కుడా తగ్గుతుంది.

 

నీళ్ళు పోయడం

కుప్ప పైన వారం లేదా పది రోజులకు ఒకసారి 10 నుండి 15 బిందెల నీళ్ళు పోయాలి.  తేమ లేకపోతే ఎరువు తయారయ్యే ప్రక్రియ ఆగిపోతుంది. వర్షాకాలం మాత్రం అంత అవసరం ఉండదు.  మొత్తం ఎరువు తయారయ్యే వరకు 10 సార్లు నీళ్ళు పోయాలి.  బోరు నీళ్ళు ఉంటె కుప్పల లోకి వదలకూడదు.  నీళ్ళు ఎక్కువైతే ఎరువు తయారయ్యే ప్రక్రియ ఆగిపోతుంది.  కుప్పలలో తేమ మాత్రమే ఉండే విధంగా తడపాలి.  కుప్ప పైన ఎండినట్లు ఉంటుంది కాని లోపల తేమ పట్టుకుని ఉంటుంది.  లోపలి చెత్తను తిసిపిండితే  నీళ్ళు చేతికి తగలకుండా ఉంటె మంచిది.  ఒకవేళ నీళ్ళు వచ్చాయంటే దాంట్లో నీళ్ళు ఎక్కువైనాయని అర్ధం.  ఇలా కాకుండా చూడాలి.

కుప్పను తిరగ వేయడం:

కుప్ప వేసిన 25 రోజులకు, 60 రోజులకు తిరగవేయాలి. పైన చెత్త కిందికి, కింద నున్న చెత్త పైకి రావడం వల్ల ఎరువు తొందరగా , నాణ్యంగా తయారు అవుతుంది.  రెండుసార్లు తిరగేయడం సాద్యం కాకపోతే కనీసం 60 రోజుల తరువాత తిరగావేయాలి.  అప్పటికి అడుగులో ఉన్నది పూర్తిగా ఎరువు అవుతుంది.  పైనున్న వరసలో చెత్త సగం వరకు ఎరువు అవుతుంది.  పై వరస కిందికి, కింది వరుస చెత్త పైకి చేసినట్లయితే కుప్పలోని మొత్తం ఎరువుగా మారి నాణ్యమైన ఎరువు అందుబాటులోకి వస్తుంది.

ఎరువు తీయడం, నిల్వ చేయడం

ఎరువు తయారికి 90 నుండి 100 రోజులు పడుతుంది.  ఎరువు తయారయిన తరువాత గుంతలో నుండి తీసి వాడుకోవాలి లేదా చెట్టు నికాలో కుప్పగా పోసి చెత్తతో కప్పాలి.  లేదా మట్టితో కప్పాలి .  దీనివల్ల ఎరువు తేమగా ఉండి సారం కోల్పోకుండా ఉంటుంది.  వరద నీరు వచ్చే దగ్గర కుప్ప వేయకూడదు.

ఎరువు వాడే విధానం :

ఈ పద్దతిలో ఎరువు పూర్తిగా అవుతుంది.  కాబట్టి పంట వేసేటప్పుడు సాళ్లలో నేరుగా వేయవచ్చు. పంట  పెరిగిన తరువాత మొక్క అడుగులో వేయవచ్చు.  ఇలా వేయడం వల్ల ఎరువు వృధా కాకుండా ఉంటుంది.  పెంట ఎరువు లాగా వెదజల్లితే ఎండకు దీనిలోని పోషకాలు నష్టపోయే అవకాశం ఉంటుంది.

మంచి ఎరువు ముక్కు దగ్గర పెట్టి చుసినాకాని చెడు వాసన రాదు.  తొలకరి వానకు నేల తడిస్తే ఎలాంటి వాసన వస్తుందో ఆలాంటి వాసన వస్తుంది. ఎక్కువ వేడి కుడా ఉండదు.