దిబ్బ ఎరువు తయారీ

పశువుల పేడ మంచి ఎరువుగా ఉపయోగపడుతుందని  రైతులకు తెలిసిన విషయమే.  పేడ, పశువులు తినగా మిగిలిన గడ్డి ని ఎత్తివేసి రీతులు పోగుగా వేస్తారు.  పశువుల పక్కగా వేసిన గడ్డిని కూడా ఇందులో వేస్తారు.  ఇది మూత్రంతో తడిసి మంఛి ఎరువుగా మారే  ఆవకాశం ఉంటుంది.  ఆలాగే కొంతమంది పశువుల మూత్రం పట్టి పెంట పోగులో వేస్తారు. వంటింటి వ్యర్ధ పదార్ధాలు, బూడిద వంటివి దీనిలో  కలుస్తాయి.  ప్రతి వేసవిలో రీతులు తమకున్న పెంట సాగు ఎరువును పొలాలకు తోలుకుంటారు.  అయితే  కొన్ని మార్పులు చేయటం ద్వారా పెంట పోగు ఎరువును మరింత నాణ్యమైనదిగా మలుచుకోవచ్చు.  నిజానికి బాగా తయారయిన పెంట పోగు ఎరువు, పొడిపొడిగా, తయారు కావటానికి ౩ నెలలు పడుతుంది.  దీనిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

మొక్కలు, జంతువులు వ్యర్ధ పదార్థాలలతో దిబ్బ ఎరువు తయారవుతుంది.  జంతువుల పేడలో తాజా స్తితిలో సూక్ష్మ జీవులు, నత్రజని శాతం ఎక్కువ ఉంటాయి.  దానిని  అలాగే విడిగా ఉంచితే నత్రజనిలో అధిక భాగం అమ్మోనియా , ఇతర రూపాలలో నష్ట పోతుంది. ఆకులు, గడ్డి వంటి వాటిల్లో పిచు పదార్ధం ఎక్కువగానూ, నత్రజని శాతం, సూక్ష్మజీవులు తక్కువగానూ ఉంటాయి.  వేరు వేరుగా తుసుకున్నప్పుడు పేడనుంచి నత్రజని నష్టపోతుంది .  ఆకులలో సమతుల్యం లోపిస్తుంది.

ఒక దానిలో జరిగే నష్టాన్ని ఆపి, రెండవ దానిలోని లోపాన్ని సవరించటానికి పేడను, ఆకులతో పలచన చేయవచ్చు, లేదా ఆకులు,గడ్డిని పేడతో బలోపేతం చేయవచ్చు.  దీని పలితంగా ఏర్పడే ఎరువు స్తిరంగానూ, సమతుల్యంగాను ఉంటుంది.

ఈ రెండు రకాల వ్యర్ధ పదార్థాలను ఎంత మోతాదుల్లో  కలపాలి?

కర్బన: నత్రజని నిష్పత్తిగా పేర్కొంటూ దీనిపై ఎంతో సమాచారమా, వివరాలు అందుబాటులో ఉన్నాయి.  ఒక భాగం పశువుల పేడకు 5 భాగాల మొక్కల వ్యర్ధ పదార్ధలను (బరువు లేదా పరిమాణంలో ) కలపవచ్చు.  ఈ నిష్పత్తితో మొదలు పెడితే ఎటువంటి సమస్యలు ఎదురు కావు. ఈ తరువాత అనుభవం ఆధారంగా ఈ నిష్పత్తిని తగిన విధంగా మార్చుకోవచ్చు. 

ఎరువు తయారి ఎక్కడ చేపట్టాలి.

ఎరువు తయారికి ఎంపిక చేసిన స్థలానికి వర్షపు తాకిడి నుంచి రక్షణ ఉండాలి.  అదేవిధంగా సూర్యకాంతి నేరుగా పడకూడదు, బలమైన గాలుల తాకిడి వుండకూడదు.  స్థానికంగా అందుబాటులో ఉండే పదార్థాలతో అనువైన కప్పు తయారుచేసుకోవాలి.  ఎంపిక చేసిన ప్రాంతంలో నేలను కుళ్ళగించి వాదులు చేయాలి.  నీళ్ళు ఇంకలేని గట్టి ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేయకూడదు. 

కొలతలు

అందుబాటులో ఉండే వ్యర్ధ పదార్ధాలు, లేదా ఎంత ఎరువు అవసరం అన్న దానిపై దిబ్బ (లేదా గుంత) కొలతలు ఆధారపడి ఉంటాయి. 

అయుదు అడుగులకు మించి దిబ్బ ఎత్తు ఉండకూడదు. పొడవు, వెడల్పు అనేవి మనకు ఉన్న  స్థలాన్ని బట్టి, ఆ తరువాత చేపట్టబోయే పనుల బట్టి మారవచ్చు .  అయిదు అడుగుల ఎత్తు అయితే దిబ్బ లోకి గాలి తేలికగా చొరబడుతుంది.  ఇంతకు మించి ఎత్తు ఎక్కువ అయినప్పుడు బరువుకి కింద భాగంలో వ్యర్ధ పదార్థాలు గట్టిగా అయిపోతాయి.  ఆచరణలో  మూడు అడుగుల ఎత్తు దిబ్బలను తేలికగా నిర్యహించవచ్చు.

ఎరువు తయారు చేసే విధానం.

5 అడుగుల ఎత్తు ౩ అడుగుల పొడవు, ౩ అడుగుల వెడల్పు కుప్పను ఇక్కడ ఉదాహరణగా తీసుకుందాం.  మొక్కల వ్యర్ధ పదార్ధాలని (పచ్చివి, ఎండువి) సేకరించి వాటిని 1-2 అంగుళాల ముక్కలుగా కత్తిరించాలి.  గట్టిగా ఉండే పెద్ద కొమ్మలను వేరు చేసి వాడకుండా  ఉంటే మంచిది.

రాలిన ఆకులు వంటి ఎండు పదార్ధాలను ఉపయోగించే ముందు నీళ్ళు చల్లుతూ  తిప్పుతూ బాగా కలపాలి ,  ఎండు పదార్ధాలను బాగా తడవటానికి చాలా సమయం  పడుతుంది.  కాబట్టి కుప్ప తయారు చేయడానికి ఒకరోజు ముందే ఈ ఎండు పదార్ధాలను తడపాలి. 

పచ్చని ఆకులు లేదా అప్పుడే కత్తిరించిన పచ్చి కొమ్మలు ఎండు పదార్ధాలను కలిపి వాడవచ్చు.  లేదా వేరే పొరగా వేయవచ్చు.  వీటిని ముందుగా తడిపిన ఎండు పదార్ధాలతో కలిపి వాడటం మంచిది.

  • ఒక పాత్రలో పశువుల పేడకు నీళ్ళు కలిపి  కళ్ళాపి మాదిరి చేయాలి.
  • ఎంపిక చేసిన ప్రాంతంలో ౩ xx౩ అడుగుల ప్రాంతాన్ని  గుర్తుంచాలి. 
  • గుర్తుంచిన ప్రాంతం మధ్యలో తవ్వి 2-౩ అంగుళాల మందం, ఆరు అడుగుల పొడవు ఉండే కట్టె పుల్లను కదలకుండా ఉండేలా పాలిపెట్టాలి.  దిబ్బలో గాలి బాగా ప్రసరించకుండానికి ఇది పొగ గొట్టం మాదిరి పనిచేస్తుంది.
  • మొదటి పొరగా 2 అంగుళాల మందంలో  చిన్న పుల్లలు వంటి పదార్ధాలు వేయాలి.  దిబ్బ/ కుప్పను తడపుతున్నప్పుడు ఎక్కువ నిల్లు నిలబడి  పోకుండా ఈ పొర సహాయ పడుతుంది.
  • దీనిపై బాగా తడిసిన మొక్కల వ్యర్ద పదార్ధాలను 6 అంగుళాల పొరగా వేయాలి.
  • అందుబాటులో  ఉన్న కొయ్య బూడిద, లేదా మట్టిని సంనజ్ట్ పొరగా చిలకరించాలి.  ఈ పొర అర అంగుళానికి మించి ఉండకూడదు.
  • సేకరించిన వ్యర్ధ పదార్ధాలన్ని అయిపోయే వరకు పై మూడు పొరలను మళ్ళి, మళ్ళి వేయాలి.  మొత్తం మీద దిబ్బ ఎత్తు 5 అడుగులకు మించకుండా జాగ్రత్త పడాలి.

కుప్ప తయారయిన ఒక గంట తరువాత దాంట్లో చెయ్యి పెట్టి చూస్తే కుప్ప వేడెక్కడం మొదలయ్యిందని గమనిస్తారు. కంటికి కనపడని మన మిత్రులైన సూక్ష్మ జీవులు వ్యర్ద పదార్ధాలను పోషకలుగా మార్చే ప్రకియను మొదలు పెట్టాయని ఇది సూచిస్తుంది.  ఇలా ఉత్పన్నమైన వేడి సాధ్యమైనంత సేపు ఆ కుప్ప లోనే ఉంటె ఉపయోగకరంగా ఉంటుంది. కుప్పమీద ఇటుక ముక్కలు, పల్చటి రాళ్లుపెట్టడం ద్వార దీనిని సాధించవచ్చు. ఈ క్రంమంలో కుప్ప మీద బరువు ఎక్కువ కాకుండా చూడాలి.

కుప్పను ప్రతిరోజూ గమనిస్తూ  ఉండాలి.  కుప్ప లోని పదార్ధాలు ఎప్పుడూ ఎండిపొయినట్లు కాకూడదు.  అవసరమైతే నీళ్ళు చిలకరంచాలి .  (పొయ్య కూడదు). కుప్ప లో నీళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కువ కాగూడదు. నీళ్ళు ఎక్కువైతే చెడు వాసన వస్తుంది.  ఈగలు చేరతాయి. ఇటువంటి పరిస్తితుల్లో కుప్పలోని పదార్ధాలన్నిటింనీ బాగా కలిపి మళ్ళి తయారు చేయాలి.  కుప్పలోని పదార్ధాలన్నిటింనీ బాగా కలిపి మళ్ళి కుప్ప తయారు చేయాలి.  కుప్ప లోని పదార్ధాలు నీళ్ళు ఓడుతూ / కారుతూ ఉండకూడదు .  తడిపి, పిండిన బట్ట మాదిరి తేమ ఉంటే సరిపోతుంది. 

మొదటిసారి తిప్పడం : కుప్ప తయరు చేసిన తరువాత మూడు వారలు గడవనివ్వాలి.  ఇప్పుడు కుప్ప లోని పదార్ధాలను బాగా కలిపి కుప్పను మళ్లి తయారుచేయాలి.  ఈ క్రమంలో పైన, కింద ఉన్న పదార్ధాలు బాగా కలిసేలా చూడాలి.  కుప్పను తిరిగి తయారు చేసేటప్పుడు అవసరమయితే  నీళ్ళు చిలకరించాలి

రెండవసారి తిప్పడం: మొదటిసారి తిప్పిన తరువాత మూడు వారాలు గడవనివ్వాలి.  ఆ తరువాత కుప్పను రెండోసారి తిప్పాలి.  పదార్ధాలను బాగా కలపాలి.  అవసరమయితే కొన్ని నీళ్ళు చిలకరించాలి.  మధ్యలో పతిన కట్టే పుల్లను తీసేయ్యాలి. రెండవసారి తిప్పిన తరువాత గాలిలోని నత్రజని స్థిరికరింప బడుతుంది.  పరిస్తితులుఅనుకూలంగా ఉంటె 25 శాతం వరకు నత్రజని గాలిలో నుంచి స్థిరికరింపబడి ఈ ఎరువులో దొరుకుతుంది.

రెండవసారి తిప్పన తరువాత ఆరు వారాలపాటు వేసి ఉండాలి.  ఇప్పుడు పంటకు ఉపయోగించటానికి ఎరువు సిద్దంగా  ఉంది.  ఈ సమయమంతటిలో కుప్పలో తేమ తగ్గకుండా ఉంచటం చాల ముఖ్యం.

ఈ విధంగా ఎరువు తయారీ నాటికి 12 వారాలు లేదా ౩ నెలలు పడుతుంది.  ఎరువు తయారి బాగా జరిగిందో లేదో తెలుసుకొవటానికి కింది విషయాలు ఉపయోగపడతాయి.

  • ఉపయోగించిన వ్యర్ధ పదార్ధాలు బాగా చీకిపోయి వాటిని గుర్తు పట్టలేని స్తితిలో ఉంటాయి.
  • ఎరువు ముదురు గోధుమ నుండి నలుపు రంగులో ఉంటుంది.
  • తియ్యటి మట్టి వాసనతో ఉంటుంది.
  • ఎరువు పదార్ధం మెత్తగా ఉండి నీటిని పట్టి ఉంచుతుంది.
  • అనేక జీవులు మన కంటికి కనిపిస్తాయి.
  • ఎండా, వాన, గాలికి గురి చేస్తీ ఎరువు నాణ్యత తగ్గుతుంది.  ఎరువు ఎప్పుడూ కప్పి ఉంచి తేమగా ఉండేలా చూడాలి.  ఎటువంటి పరిస్తితులలోను దీనిని పూర్తిగా ఎందిపోనివ్వకూడదు.