కోశస్థ (ప్యుపా) దశ:      ఈ పురుగుకు కోశస్థ  దశ ఉండదు. 

తల్లి పురుగు :

తొలి దశలో రెక్కలున్న ఆడ పురుగులు సరైన మొక్కల కోసం వెతుకుతూ ఉంటాయి. కొన్ని రోజుల్లోనే అవి పిల్ల పురుగులను  పెడతాయి. ఇవి తిరిగి రెక్కలు లేని ఆడ పురుగులుగా ఎదుగుతాయి.  వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎక్కువ పురుగులు పుడతాయి. ఇలా పుట్టిన పురుగులు ఇతర మొక్కల మీదకు వలస పోతాయి.

మగ పురుగులు ఎక్కువగా కనపడవు. మగ పురుగులతొ కలవకుండానే ఆడ పురుగులు పిల్ల పురుగులను పెడతాయి. 

తల్లి పురుగుకు రెక్కలు ఉండవు. పురుగు గుండ్రంగా, 2 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది. లేత నీలం, ఆకుపచ్చ  రంగులో ఉంటుంది. తల మీద దట్టంగా రెండు నిలువు చారలు ఉంటాయి. ఉదరం మీద రెండు పక్కలా వరుసలలో నల్లటి మచ్చలు ఉంటాయి. శరీరం మీద పూర్తిగా పౌడర్ చల్లినట్లు మచ్చలు ఉంటాయి.