పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగు నాలుగు దశలలో పెరుగుతుంది. ఉష్ణోగ్రతను బట్టి ఈ పెరుగుదల ఉంటుంది. మొత్తంమీద పూర్తిగా పెరగడానికి 8 నుంచి 16 రోజులు పడుతుంది.
తొలి దశ పిల్ల పురుగులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తల అంచులు, కాళ్ళు శరీరం కన్నా కొంత నల్లగా ఉంటాయి.
రెండో దశ పిల్ల పురుగులు కూడా లేత ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. తల, కడుపు, కాళ్ళు మిగతా శరీరం కన్నా కొంత చిక్కగా ఉంటాయి. కాళ్ళు సన్నగా ఉంటాయి. కళ్ళు ఎర్రగా ఉంటాయి.
మూడో దశలో కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. కానీ పక్కల వెంబడి కొంత చిక్కగా ఉమ్తయ్యి. కాళ్ళు శరీరం కన్నా చిక్కగా, బరువుగా ఉంటాయి. తల మాత్రం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.