పిల్ల పురుగు (లార్వా) దశ :

గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు మొక్క అడుగు భాగానికి చేరి అక్కడ కాండాన్ని పాడు చేస్తాయి. కాండం లోపలికి తొలుచుకి వెళ్లి, దాన్ని గుల్లగా మార్చేస్తాయి.  

గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గులాబీ లేదా ముదురు గులాబీ రంగులో ఉంటాయి. 

25- 35 రోజుల లోపుల పెరుగుతాయి. ఈ లోపే చాలా మొలకలను పాడు చేస్తాయి. 

పురుగు పక్క భాగాలు దళసరిగా, నునుపుగా ఉంటాయి. 

శరీరం గుండ్రంగా, తల ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది. 

మొత్తంగా 25 మిల్లి మీటర్ల పొడవు ఉంటుంది.