పిల్ల పురుగు (లార్వా) దశ :
గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకుల పైకి ఎగబాకి ఆకుల ముడతలలోనికి చొచ్చుకుపోతాయి.
ఈ ముదతలలోనే ఆకు ఉపరితలాన్ని తింటూ బతుకుతుంది. ఎదిగే క్రమంలో ఇవి మెల్ల మెల్లగా లేత కాండం మధ్య భాగం లోకి, చివరకు కాండంలోకి చొచ్చుకుపోతాయి. పైకి, కిందకు తిరుగుతూ కణుపుల దగ్గర కాండంలోకి చొచ్చుకుపోతాయి.
మొత్తంగా 28-35 రోజుల లోపల పిల్ల పురుగు జీవిత చక్రం పూర్తీ చేసుకుంటుంది.
పిల్ల పురుగులు ముదురు గులాబి రంగులో ఉంటాయి. వెనుక భాగంలో గుంపులు గుంపులుగా నల్లటి మచ్చలు కనపడతాయి. తల భాగం గోధుమ రంగులో ఉంటుంది.
పూర్తిగా పెరిగిన పిల్ల పురుగులు 25 మిల్లి మీటర్ల పొడవు ఉంటాయి.