వ్యాప్తి (పత్తి పంటలో):

ఈ తెగులు మొదట బీజ దళాల మీద ఆశించి తరువాత ఆకులకు విస్తరింస్తుంది.

ఆకుల మీద మొదట అడుగు భాగాన, తరువాత పైన చిన్న, ముదురు ఆకు పచ్చ రంగులో నీటితో తడిచిన మచ్చలు ఏర్పడతాయి. ఈ  మచ్చలు విస్తరిస్తూ గోధుమ రంగులోకి మారతాయి.

ఒక మచ్చ ఈనెలను దాటి విస్తరించదు. కాబట్టి మచ్చలు గుండ్రంగా కాకుండా అంచులు కోణకారపు అకుమచ్చ దశ అంటారు.

ఈనెల వంటి ఈ వ్యాధి ఆకు తొదిమకీ, కాండానికి వ్యాపిస్తుంది. దీనివల్ల కాండం మీద పొడవాటి, నల్లని చరాలు ఏర్పడతాయి. దీనిని నల్ల కాళ్ళ దశ అంటారు.

గాలికి కొమ్మ తేలికగా విరిగిపోతుంది. తెగులు లక్షణాలు పువ్వు రక్షక్ పత్రం మీద, కాయ మీద కూడా కనపడతాయి.

రోగ కారక జీవి పత్తి పింజా లోకి విస్తరిస్తుంది.

రోగ కారక జీవి విత్తనం బయట, లోపల కూడా వుంటుంది.

తెగులు సోకిన విత్తనం ద్వారా ఇది ప్రధానంగా విస్తరిస్తుంది.