తల్లి పురుగు
మగ పురుగులు ఆడ పురుగులను కలవడానికి ఎగురుతూ ఉంటాయి. అయితే ఈ రకపు పురుగుల జాతులలో చాలావాటిలో మగ పురుగులు ఉండవు.
ఇలాంటి వాటిలో మగ పురుగులతో కలవకుండానే ఆడ పురుగులు గుడ్లు పెడతాయి.
వీటిలో కూడా కొన్నే పురుగులు గుడ్లు పెడితే, మరికొన్ని నేరుగా పిల్లలనే కంటాయి.
మామూలు పరిస్థితుల్లో ఈ పురుగు జీవిత చక్రాన్ని 26 – ౩0 రోజులలో పూర్తి చేసుకుంటుంది.
తల్లి పురుగు శరీరం చాలా మృదువుగా, పొడవుగా, గుండ్రంగా ఉంటుంది. కాళ్ళు స్పష్టంగా అభివృద్ధి చెంది ఉంటాయి.
ఇవి ౩ – 5 మిల్లి మీటర్ల వరకు పొడవు ఉంటాయి. శరీరం నుంచి మైనం వంటి పదార్ధం కారుతూ ఉంటుంది. ఇది క్రమేపి ముందు, వెనుక పోగులుగా మారుతాయి.
మామూలుగా రెక్కలు ఉండవు. కదిలిస్తే గానీ కదలవు. వెనుక కొమ్మలు, ఆకులు, కాయల వద్ద గుంపులు గుంపులుగా ఉంటాయి.
కొద్ది కాలం మాత్రమే జీవించే మగ పురుగులు ౩ మిల్లి మీటర్ల మేర పొడవు ఉంటాయి.
మగ పురుగులకు ఒక జత రెక్కలు ఉంటాయి. కళ్ళు చాలా ఉంటాయి. అయితే నోటి భాగాలు మాత్రం ఉండవు.