పిల్ల పురుగు (లార్వా) దశ :
గుడ్ల నుంచి బయటికి వచ్చిన పిల్ల పురుగు మూడు రకాలుగా రూపాంతరం చెందుతుంది. 22 – 25 రోజులలో ఈ మూడు రూపాలను పూర్తి చేస్తుంది.
గుడ్ల నుంచి బయటికి రాగానే పిల్ల పురుగులు చాలా చురుకుగా కదులుతూ ఉంటాయి. అలా కదులుతూ చాలా దూరం వెళతాయి. పెరిగిన పిల్ల పురుగులు మాత్రం మొక్క భాగాలను అంటిపెట్టుకునే ఉంటాయి.
పిల్ల పురుగులు కూడా చాలా చిన్నగా ఉంటాయి. సమతలంగా కానీ, బల్ల పరుపుగా కానీ ఉండి, పసుపు రంగులో కనపడతాయి.
కొన్ని జాతులకు చెందిన పిల్ల పురుగులు పెద్దవిగా మారిన తరువాత వాటికి పైన తెల్లటి మైనంతొ పాటు ఈకల వంటివి ఉంటాయి.
పెద్దవిగా మారిన లార్వాలు తల్లి పురుగుల మాదిరిగానే ఉంటాయి.
పెద్దవైన మగ లార్వాలు చిన్నటి ఈకలతో కూడిన గూడు ఆకారంలో ఒక ద్రవాన్ని కారుస్తూ ఉంటాయి. రానురాను ఇవే రెక్కలుగా మారుతాయి.