గుడ్లు:
ఆడ పురుగు ఒక్కోసారి ౩౦౦ నుంచి 5౦౦ వరకు గుడ్లు పెడుతుంది. గుడ్డు 4-7 మిల్లి మీటర్ల సైజులో ఉంటుంది.
లేత రంగులో లేదా బంగారు గోధుమ రంగులో ఉంటాయి. ఆకుల కింది భాగంలో గుడ్ల సమూహం ఉంటుంది.
ఈ గుడ్ల సమూహంపైన సన్నని వెంట్రుకల మాదిరి ఉంటాయి. మాములుగా 4-5 రోజులలో గుడ్లు పొదగబడతాయి.