లార్వా (పిల్ల పురుగులు):  

పిల్ల పురుగు లేత ఆకుపచ్చలో ఉంటుంది.  గొంతు దగ్గర ముదురుగ కనపడుతుంది. పల్చటి చర్మంపైన ఎరుపు, పసుపు, ఆకుపచ్చ గీతలు, తల వెనుక భాగంలో నల్లటి మచ్చ ఉంటాయి.

ఆకును చివరలు మాత్రం మిగిలేల తొలుచుకుని తింటూ జల్లెడలా చేస్తుంది.

ఆ విధంగా ఆకు మీద ఉన్న పచ్చదనం అంతా తినేస్తుంది. ఇలా జల్లేడ మాదిరిగా తయారైన ఆకులను చూసి రైతు పంటకు పురుగు పట్టిందని తెలుసుకోవచ్చు.

పిల్ల పురుగు పెరుగుతున్న కొద్దీ ఆకులతో పాటు, పువ్వులను, పండ్లను, మొక్కలోని ఇతర లేత భాగాలను కూడా తినేస్తుంది.  

లార్వాల ఉధృతి ఎక్కువైనప్పుడు, మొక్క వడలి పోయినట్టు కనపడుతుంది.

మామూలుగా పిల్ల పురుగులు రాత్రి పూట ఎక్కువగా  ఆకులను తిని మొక్కను నాశనం చేస్తాయి.

రోజంతా మొక్క అడుగుభాగంలో ఉన్న చెత్తలో కానీ, నేలలో కానీ దాగి ఉంటాయి. సీజను,ఆహార లభ్యత బట్టి ఈ దశలో దాదాపు 20-౩౦ రోజుల పాటు ఉంటాయి.