జొన్న
మన రాష్ట్రం లోనే కాకుండా దేశంలో కూడా జొన్న ఒక ప్రధానమైన ఆహార పంట. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాలలో ప్రజల ఆహార అవసరాలను మాత్రమే కాకుండా పశు జీవాల మేత అవసరాలను కూడా తీర్చే పంటగా జొన్న పంటకు చాలా ప్రాధాన్యత ఉంది. ఖరీఫ్ లోను, రబీ లోను సాగు చేసుకోవడానికి అనువైన పంట ఇది. పంట సాగు విస్తీర్ణం పరంగా చూస్తే, ప్రపంచంలో మన దేశం తొలి స్థానంలో ఉన్నప్పటికీ, ఉత్పత్తిలో మాత్రం రెండో స్థానంలో ఉంది, ఆంధ్ర ప్రదేశ్ లో జొన్న పంట ఖరీప్ లో ౩. ౦. లక్షల ఎకరాల్లోను, రబీలో 4.25 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతున్నది. ఎకరా సరాసరి దిగుబడి ఖరిఫ్ లో 6౩8 కిలోలు, రబీలో 61౦ కిలోలు.
ఆంధ్ర ప్రదేశ్ లో జొన్నపండించే ప్రాంతాలు:
- ఎర్ర చెల్క నేలలు గల మహబూబ్ నగర్, కర్నూల్ జిల్లాలు (ఖరీఫ్ లో తక్కువ వర్షపాతం)
- ఖరిఫ్ లోనే అదిక వర్షపాతం గల ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలు
- మాఘీ ప్రాంతం- ఖమ్మం, వరంగల్, నల్గొండ, కర్నూల్, కడప జిల్లాలు
- సాధారణ రబీ ప్రాంతం- ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాదు, మహబూబ్ నగర్ జిల్లాలు.
- ఆలస్యంగా జొన్న పండించే రబీ ప్రాంతాలు – ప్రకాశం జిల్లా
నేలలు
జొన్న అనేక రకాల నేలలలో పండుతుంది. తేమ ఎక్కువగా ఉండే బంకమట్టి నేలలు ఈ పంటకు అనువైనవి. నేలలో కొంత వరకు ఆమ్ల, క్షార గుణాలున్నప్పటికీ (పి. హెచ్ 5.5 – 8.0) ఈ పంటను వేసుకోవచ్చు. అయితే, పంట వేసే నేలలో మురుగు నీరు పోయే సౌకర్యం ఉండాలి. పెరిగిన పంటలో నీరు నిలిస్తే, అది చాలా నష్టం చేస్తుంది. నీరు నిలిచి ఉంటే, కంకులు కుళ్ళిపోతాయి. మొక్క చచ్చిపోతుంది.
పంట వేసే కాలం
ఖరిఫ్ మాఘీ రబీ లేట్ రబీ వేసవి
జూన్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ జనవరి
రకాలు
క్ర. సం |
రకం
(Type) |
వేసే సమయం
(Season) |
పంట కాలం
(రోజుల్లో)
Crop duration
(in days) |
దిగుబడి
(కిలోలు/ ఎకరానికి
Yield (Kilos/ acre) |
గుణగణాలు
(Remarks) |
1. |
సి.ఎస్. హెచ్. – 1౩/
సి.ఎస్. హేచ్ – 1౩ ఆర్ |
ఖరిఫ్, రబీ |
12- 14 |
|
బెట్టను, నల్ల కాండం కుళ్ళు తెగులును. కుంకుమ తెగులును, పేనుబంకను తట్టుకుంటుంది. ఎత్తుగా పెరుగుతుంది. చొప్ప ఎక్కువగా ఇస్తుంది. |
2. |
సి.ఎస్.హెచ్. 16 |
ఖరిఫ్ - మాఘీ |
1౦5- 11౦ |
15-17 |
బూజు, అకుమచ్చతెగుళ్లను తట్టుకుంటుంది. |
౩ |
సి.ఎస్.హెచ్. 14 |
ఖరిఫ్ |
95- 1౦౦ |
12- 1౩ |
బూజు మరియు అకుమచ్చ తెగుళ్ళని తట్టుకుంటుంది. |
4. |
సి.ఎస్.హెచ్. 18 |
ఖరిఫ్ |
11౦- 115 |
16- 17 |
గింజపై వచ్చే బూజు తెగులును తట్టుకుంటుంది. |
5. |
పి.ఎస్.వి.-1 |
ఖరిఫ్ – రబీ |
1౦5-11౦ |
1౦ – 12 |
గింజ తెలుపు, చొప్ప పశువులు తినుటకు అనుకూలంగా వుంటుంది. |
6 |
సి.ఎస్.వి – 15 |
ఖరిఫ్ |
11౦ |
1౦-12 |
గింజ తెలుపు, చొప్ప పశువులు తినుటకు అనుకూలంగా వుంటుంది. |
7 |
నంద్యాల తెల్ల జొన్న -1 (ఎస్.టి.జే.-1) |
మాఘీ, రబీ |
95-1౦౦ |
12-14 |
బెట్ట తట్టుకుంటుంది. గింజ రాలటంలో ఇబ్బంది లేక బాగా రాలుతుంది. |
8 |
నంద్యాల తెల్ల జొన్న -2 (ఎస్.టి.జే.-1) |
మాఘీ, రబీ |
95-1౦౦ |
12-14 |
పంట త్వరగా కోతకు వస్తుంది. గింజలు లావుగా, తెల్లగా, మెరుస్తూ వుంటాయి. గింజలు సులభంగా రాలుతాయి. |
9. |
నంద్యాల తెల్ల జొన్న -౩ (ఎస్.టి.జే.-౩), |
మాఘీ, రబీ |
1౦౦-1౦5 |
12-14 |
చొప్పఎక్కువగా ఇస్తుంది. బెట్టకు, అకుమచ్చ తెగుల్లకు తట్టుకుంటుంది |
10 |
యన్-1౩ (పచ్చజొన్న) |
మాఘీ, రబీ |
95-1౦౦ |
7-8 |
నాణ్యమైన చొప్ప ఎక్కువగా వస్తుంది. జొన్న నల్లిను, బెట్టను తట్టుకొంటుంది. |
11 |
యన్-14 (పచ్చజొన్న) |
మాఘీ, రబీ |
11౦-115 |
1౦-12 |
యన్-1౩ కంటే గింజలు మరియు చొప్పఎక్కువగా ఇస్తుంది.
సి.ఎస్.వి. 216 ఆర్, రబీ, 11౦-115, 12-14, గింజ తెలుపు, చొప్ప ఎక్కువగా వచ్చి, నాణ్యంగా వుంటుంది. |
12 |
పాలెం -2 |
ఖరిఫ్ |
1౦5- 11౦. |
11-12 |
గింజ తెలుపు, చొప్ప దిగుబడి నిస్తుంది. బూజు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది |
1౩ |
ఎన్.టి.జె. -4 |
రబీ, మాఘీ |
9౦-98 |
1౩-15 |
నల్ల కాండం కుళ్ళు తెగుల్లును కొంతవరకు మోవ్వచంపు ఈగ మరియు శనగపచ్చ పురుగును కొంతవరకు తట్టుకుంటుంది. |
14 |
యం. ౩5-1 |
రబీ, మాఘీ, |
115-12౦ |
1౦-12 |
గింజలు, చొప్ప నాణ్యంగా వుంటాయి. |
15 |
సి.ఎస్.వి. 14 ఆర్. |
రబీ |
115-12౦ |
1౦-12 |
బెట్టను, నల్లకాండం కుళ్ళు తెగులును, మొవ్వ చంపు ఈగను కొంతమేర తట్టుకుంటుంది. |
16 |
సి.ఎస్. హెచ్.15 ఆర్. |
రబీ |
11౦-115 |
1౩-14 |
మొవ్వ చంపు ఈగను, కాండం కుళ్ళును తట్టుకుంటుంది |
17 |
కిన్నెర (ఎం.జె.-278) |
మాఘీ, రబీ |
11౦-115 |
12-16 |
బెట్టను తట్టుకుంటుంది. తెలంగాణాలో అన్ని ప్రాంతాలకు అనుకూలం. |
విత్తన మోతాదు.
విత్తనం: ఎకరాకు ౩-4 కిలోలు
విత్తన శుద్ధి
కిలో విత్తనానికి ౩ గ్రాముల థైరం లేదా కాపట్టన్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి.
విత్తడం / నాటడం
వరుసల మధ్య 45 సెం.మీ. వరుసలో మొక్కల మధ్య 12-15 సె.మీ. దూరంలో విత్తాలి. ఎకరాకు 58,౦౦౦-72,౦౦౦ మొక్కలు వుండాలి.
నీటి యాజమాన్యం
ఖరిఫ్ లో జొన్నకు నీరు పెట్టవలసిన అవసరం లేదు. నల్లరేగడి నేలల్లో రబీ జొన్నకు పూత మరియు గింజ పాలు పోసుకునే సమయంలో అవసరమైతే నీరుకట్టాలి. వేసవి ఫైరుకు తేలిక నేలల్లో వారానికి ఒకసారి, నల్లరేగడి నేలల్లో 15 రోజులకొకసారి తడి ఇవ్వాలి.
కలుపు యాజమాన్యం
విత్తిన ౩౦ రోజులకు గుంటక లేదా దంతితో అంతర కృషి చేయడం వలన పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన రెండు వారాలలోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి.
కలుపును నివారించేందుకు అట్రజిన్ 5౦ శాతం పొడిమందుని ఎకరాకు 8౦౦ గ్రా. చొప్పున 25౦ లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2 రోజుల లోపల తడి నేలపై పిచికారి చేయాలి.
జొన్నమల్లి మొలకెత్తినప్పుడు, లీటర్ నీటికి 5౦ గ్రా. అమోనియం సల్ఫేట్ గాని, 2౦౦ గ్రా. యూరియాని గాని కలిపి మల్లిపై పిచికారి చేసి నివారించవచ్చు. లేదా లీటర్ నీటికి 2,4-డి సోడియం సాల్ట్ 2 గ్రాములు కలిపి పిచికారి చేసి కూడా మల్లెను నివారించవచ్చు. మామూలుగా జొన్న విత్తిన ౩5-4౦ రోజులకు ఈ జొన్న మల్లె మొలకెత్తుతుంది.
పురుగులు – తెగుళ్ళు
ఎరువులు – పోషకాల యాజమాన్యం
పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసి అఖరి దుక్కిలో కలియదున్నాలి. నీటి పారుదల పంటకు అయితే ఎకరాకు 32-4౦ కిలోల నత్రజని. 24 కిలోల భాస్వరం, 16 కిలోల పోటాష్, వర్షాధార పంటకు 24-౩2 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. నత్రజని ఎరువును 2 సమ దఫాలుగా విత్తేటప్పుడు ఒకసారి, ఫైరు మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు రెండోసారి వేయాలి.
పంట కోత
కంకి కింది వరుసల్లో వున్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి, గింజలో నున్నపాలు ఎండిపోయి పిండిగా మారినపుడు, గింజ కింది భాగంలో నల్లటి చార ఏర్పడిన తర్వాత పంట కోయాలి. |
|
|
 |