చదును / దుక్కి దమ్ము నాగలి:
ఈ నాగలిని అన్ని రకాల నేలలోను ఉపయోగించవచ్చు. తేలిక నేలలలోను గిత్తలు దీనిని లాగగలవు. 75 సెం.మీ.వెడల్పు గల ఈ దమ్ము నాగలితో రోజుకు సుమారు రెండు ఎకరాలను ఒకసారి దమ్ము చేయవచ్చు.ఈ నాగలి మట్టిగడ్డ లను పగులగొట్టడమేగాక నీరు భూమి లోపలికి ఇంకిపోవడాన్ని తగ్గిస్తుంది. సేద్యపు నీటి వాడకాన్ని పొదుపు చేస్తుంది
ఈ దమ్ము నాగలిని ఉపయోగించేప్పుడు భూమి పైన కనీసం 6 సెం.మీ.నీరు ఉండాలి. దీనిని దిగబడే నేలలో ఉపయోగించేటప్పుడు గానీ చిన్న గిత్తలతో దమ్ము చేసేటప్పుడు గాని సీటుపై మనిషి కూర్చోరాదు. గడ్డి కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగిన నేలలో ఉపయోగించాలంటే ముందుగా ఒకసారి పొలాన్ని ఇనుపనాగలితో దున్నాలి.
ఈ దమ్ము నాగలిని ఉపయోగించటం వలన దమ్ము చేయతనికయ్యే ఖర్చు తగ్గటమే గాక పని తొందరగా పూర్హి అవుతుంది. దమ్ము నాణ్యత కూడా బాగుంటుంది.ఈ నాగలిని ఉపయోగించేటప్పుడు దిగుబాటు భూముల్లో బ్లేడ్లను అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవాలి. దీని ధర రూ 2780/-
మాగాణి భూమి చదును చెసే యంత్రం (ట్రాక్టర్ తో):
ఇది ట్రాక్టర్ సహాయంతో నడుస్తుంది. ఇది ట్రాక్టర్ వెడల్పును, కేజ్ వీల్స్ వెడల్పును కవర్ చేస్తుంది. లెవలింగ్ బ్లేడ్ ఎత్తును, బ్లేడ్ వాలును 0 డిగ్రీ నుండి 90 డిగ్రీ ల వరకు ట్రాక్టర్ హైడ్రాలిక్ లివర్ సహాయం తో మార్చుకోవచ్చు.ఈ యంత్రం సహయం తో మాగాణి భూమిని తక్కువ సమయంలో చక్కగా చదును చేసుకోవచ్చు. రోజుకు సుమారు 2 హెక్టార్ల పొలం చదును చేసుకొనవచ్చు. దీనిని బాగా దమ్ము చేసిన తరువాతనే ఉపయోగించాలి. ఉపయోగించేటప్పుడు పొలంలో పలుచగా నీరు ఉంచాలి. గట్ల దగ్గర, మలుపుల వద్ద మనుషుల సహాయంతో చదును చేసుకోవాలి.
ధర రూ.20,000/-
రోటావేటరు:
ఈ పరికరం మెట్ట నెలల్లో మెట్ట దుక్కికి, మాగాణి భూముల్లో దమ్ము చేసేందుకు ఉపయోగపడుతుంది, మెట్ట నేలల్లో గడ్డలు లేకుండా మెత్తటి దుక్కి చేయాలి. ఇది 35 లేదా అంతకు ఎక్కువ హెచ్.పి ట్రాక్టర్ తో పని చేస్తుంది. దీనికి అమర్చిన రోటావెటర్ తో 5 వరుసలలో బ్లేడ్ లు ఉంటాయి. ఈ రోటావెటర్. ట్రాక్టర్ పి.టి.ఒ ద్వారా పనిచేస్తుంది. రోజుకు 6-7 ఎకరాల్లో దుక్కిగాని,దమ్ముగాని చేసుకోవచ్చు.]
పవరు టిల్లర్ లెవలింగ్ బ్లేడ్:
పవరు టిల్లరు కలిగిన రైతులు దినిని ఉపయోగించి మాగాణి భూములను దమ్ము చేసిన తరువాత భూమిని లెవల్ చేసుకోవచ్చు. దీనితో గంటకు 0.12 హెక్టారుల పొలము లెవలు చేసుకోవచ్చు. హెక్టారు పొలం లెవలు చేయుటకు సుమారు రూ.600/- ఖర్చు అవుతుంది.
ధర 5,000/-
దమ్ము, లెవలు చేయు పరికరం (ట్రాక్టర్ తో నడిచేది)
ఈ పరికరము 35.౦హెచ్.పి.ట్రాక్టర్ తో నడుచును. ఈ పరికరనుపయోగించి బాగుగా దున్ని నీళ్ళు పెట్టిన భూమిలో దమ్ము చేసుకొనవచ్చును మరియు భూమిని లెవలు చేసుకొనవచ్చును.దీనితో గంటకు 0.35 నుండి 0.38 హెక్టారుల భూమిని దమ్ము చేసి లెవలు చేసుకొనవచ్చును
ధర రూ 45,000/- (ట్రాక్టర్ ఖరీదు అదనం).
విత్తేవి / నాటేవి
ఎరువు, విత్తనం ఒకేసారి వేసే పరికరం (ఎద్దులతో నడిచేది): ఈ యంత్రం సహాయంతో పలు పంటలను ఎరువుతో సహా విత్తుకోవచ్చు జొన్న,మొక్కజొన్న,వేరుశనగ, ఆముదం విత్తనాన్ని తేలికగా విత్తుకోవచ్చు. వేరు వేరు పంటలను విత్తటానికి ఆయా పంటలకు సంబందించిన రోలర్లను మార్చుకోవాలి. పంటలను బట్టి సాల్ల మద్య దూరాన్ని మార్చుకునే ఏర్పాటు వుంది. ఒకేసారి 3 సాల్ల వరకు విత్తనం, ఎరువు వేసుకోవచ్చు, సాల్ల మధ్య దూరం 30 సెం.మీ - 90 సెం.మీ వరకు మార్చుకోవచ్చు దీని సహాయంతో రోజుకు రెండున్నర ఎకరాల విత్తనం, ఎరువు ఒకేసారి వేసుకోవచ్చు ఈ పరికరాన్ని ఉపయోగించి ముందు భూమిని బాగా దున్ని తయారుచేయాలి. ఈ పరికరాన్ని అప్పుడప్పుడు సరి చేసుకోవాలి.
ధర రూ 8,000/-
ఎరువు,విత్తనం ఒకేసారి వేసే పరికరం (ట్రాక్టర్ తో నడిచేది):
దిని సహాయంతో పలు పంటలను ఎరువుతో సహా విత్తుకోవచ్చు. జొన్న,మొక్కజొన్న,వేరుశెనగ, ఆముదం లాంటి విత్తనాన్ని తేలికగా విత్తుకోవచ్చు. వేరు వేరు పంటలను విత్తడానికి ఆయా పంటలకు సంబందించిన రోలర్లను మార్చుకోవాలి. పంటలను బట్టి సాల్ల మద్య దూరాన్ని మార్చుకోవచ్చు. ఒకేసారి 9 సాళ్ళ వరకు విత్తనం, ఎరువు వేసుకోవచ్చు. ఈ పరికరంతో రోజుకు ఏడున్నర ఎకరాల వరకు విత్తనం, ఎరువు వేసుకోవచ్చు. విత్తేటప్పుడు గింజలు,ఎరువు సక్రమంగా పడుతున్నది లేనిదీ చూసి సరిచేసుకోవాలి ధర రూ 35,౦౦౦/-
వరి విత్తే సాధనం:
ఈ యంత్రం ద్వారా 8 సాళ్లలో మొలకెత్తిన వరి విత్తనాన్ని చల్లవచ్చు. వరి నారు పెంచడం, నాటడం మొదలైన పనులను నివారించవచ్చు. ఒక మనిషి యంత్రం లాగటానికి, ఇంకొంకరు వరి విత్తులు నింపడానికి కావలెను. గంట సమయంలో పావు ఎకరంలో వరి విత్తుకోవచ్చు.
ధర రూ.6,400/-,
ఎనిమిది సాళ్ళ వరి నాటు యంత్రము:
ఈ యంత్రం లో ఒకేసారి 8 సాళ్లలో వరి నాటుకోవచ్చు. ఈ యంత్రం 8 హెచ్.పి. డీజిల్ ఇంజనుతో నడుస్తుంది. చైనా దేశంలో తయారుచేయబడింది. ఈ యంత్రానికి తప్పనిసరిగా చాప నారు ప్లాస్టిక్ షీట్ ను ఉపయోగించి పెంచవలెను. దిని బరువు 320 కేజీలు. దీనితో సాళ్ళు వరుసకు వరుసకు మద్య 23.8 సెంటి మీటర్లు, హిల్ కు హిల్ కు మద్య 140- 170 సెంటి మీటర్లు వేసుకోవదానికి వీలుంది. ఈ యంత్రంలో రోజుకు 4 ఎకరాల పొలం నాటుకోవచ్చు.
ధర రూ.1,75,000/-.
ఎరువులు / మందులు వేసేవి ఎరువు, విత్తనం ఒకేసారి వేసే పరికరం (ఎద్దులతో నడిచేది):
ఈ యంత్రం సహాయంతో పలు పంటలను ఎరువుతో సహా విత్తుకోవచ్చు జొన్న,మొక్కజొన్న,వేరుశనగ, ఆముదం విత్తనాన్ని తేలికగా విత్తుకోవచ్చు. వేరు వేరు పంటలను విత్తటానికి ఆయా పంటలకు సంబందించిన రోలర్లను మార్చుకోవాలి. పంటలను బట్టి సాల్ల మద్య దూరాన్ని మార్చుకునే ఏర్పాటు వుంది. ఒకేసారి 3 సాల్ల వరకు విత్తనం, ఎరువు వేసుకోవచ్చు, సాల్ల మధ్య దూరం 30 సెం.మీ - 90 సెం.మీ వరకు మార్చుకోవచ్చు దీని సహాయంతో రోజుకు రెండున్నర ఎకరాల విత్తనం, ఎరువు ఒకేసారి వేసుకోవచ్చు ఈ పరికరాన్ని ఉపయోగించి ముందు భూమిని బాగా దున్ని తయారుచేయాలి. ఈ పరికరాన్ని అప్పుడప్పుడు సరి చేసుకోవాలి.
ధర రూ 8,000/-
ఎరువు,విత్తనం ఒకేసారి వేసే పరికరం (ట్రాక్టర్ తో నడిచేది):
దిని సహాయంతో పలు పంటలను ఎరువుతో సహా విత్తుకోవచ్చు. జొన్న,మొక్కజొన్న,వేరుశెనగ, ఆముదం లాంటి విత్తనాన్ని తేలికగా విత్తుకోవచ్చు. వేరు వేరు పంటలను విత్తడానికి ఆయా పంటలకు సంబందించిన రోలర్లను మార్చుకోవాలి. పంటలను బట్టి సాల్ల మద్య దూరాన్ని మార్చుకోవచ్చు. ఒకేసారి 9 సాళ్ళ వరకు విత్తనం, ఎరువు వేసుకోవచ్చు.
ఈ పరికరంతో రోజుకు ఏడున్నర ఎకరాల వరకు విత్తనం, ఎరువు వేసుకోవచ్చు. విత్తేటప్పుడు గింజలు,ఎరువు సక్రమంగా పడుతున్నది లేనిదీ చూసి సరిచేసుకోవాలి
ధర రూ 35,౦౦౦/-
బూమ్ స్ప్రేయర్:
వరి కోత యంత్రంలో కొన్ని మార్పులు చేసి బూమ్ స్ప్రేయర్ రూపొందించబడింది. వరుసలలో విత్తిన/నాటిన అన్ని మెట్ట పంటలలో (45 రోజులలోపు) ఈ యంత్రాన్ని ఉపయోగించి పురుగు మందులను పిచికారి చేయవచ్చు. ఇందులో 14 నాజిల్లు అమర్చబడి ఒకేసారి 6 మీటర్ ల వెడల్పుతో మందు చల్ల బడుతుంది, స్ప్రేయింగ్ చేయవలసిన పంట ఎత్తును బట్టి,పంట వరుసల దూరాన్ని బట్టి నాజిల్ ఎత్తును (౩౦సెం..మీ.-60 సెం.మీ) నాజిల్ల మద్య దూరాన్ని మార్చుకోవచ్చు. ఈ యంత్రాన్ని ఉపయోగించి రోజుకు షుమారు 4 హెక్టార్ల పొలం లో మందు చల్లవచ్చు.
ధర రూ.36,380/- .
కలుపు తీసేవి కోనోవీడరు:
ఈ పరికరం ఐ.ఆర్.ఆర్.ఐ.వారిచే రూపొందించబడింది. సాళ్ళలో నాటిన, ‘శ్రీ’ పద్ధతిలో సాగు చేసిన వరి పొలంలో కలుపు తీయడానికి సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ పరికరం పని చేసేందుకు తగు మోతాదులో నీరు ఉండాలి. నీరు లేకుంటే వీడరుకు మట్టి చుట్టుకొని సరిగా పని చేయదు. దీనితో రోజుకు అర ఎకరంలో కలుపు తీసుకోవచ్చు. ధర రూ.1,340/-
నూర్పిడి చేసేవి పంటల నూర్పిడి యంత్రం:
ఈ యంత్రాన్ని ఉపయోగించి పలు పంటలను నూర్చి, విత్తనాన్ని జల్లెడ పట్టి మంచి విత్తనాన్ని వేరుచేసుకోవచ్చు ముఖ్యంగా వరి గోధుమ, జొన్న, మొక్కజొన్న పంటలకు ఇది చాల ఉపయోగం. వేరు వేరు పంటలు నూర్చ్గడానికి ఈ యంత్రం లోని కొన్ని భాగాలను తగు విధంగా సవరించాలి. వరి, గోధుమ పంటలను నూర్చడానికి ఈ యంత్రం లోనికి కంకులతో పాటు మొక్కలను వేయవచ్చు. జొన్న మొక్కజొన్న కంకులను మాత్రమే ఈ యంత్రం లోనికి వెయ్యాలి. వరి నూర్చినప్పుడు, వరి గడ్డి ఏ మాత్రం పాడవకుండా పశువులు తినటానికి అనుకూలంగా వుంటుంది.
ఈ యంత్రం నడపటానికి 7.5 హెచ్ .పి విద్యుత్ మోటర్ గానీ, డీజిల్ ఇంజను గాని ఉపయోగించవచ్చు ఈ యంత్రం గంటకు 6 - 10 క్వింటాళ్ల వరి , 4 – 10 క్వింటాళ్ల గోధుమ, 10 – 15 క్వింటాళ్ల జొన్న, 15 - 20 క్వింటాళ్ల మొక్కజొన్న నూర్చుతుంది
దీని ధర రూ 8 9, 5 6 0/-
నూర్పిడి చేసే యంత్రం:
ఈ యంత్రం 5 హెచ్.పి మోటార్ సహాయంతో పనిచేస్తుంది, ప్రొద్దుతిరుగుడు పూలను, మొక్కజొన్న కంకులను నూర్చడమే గాక జల్లెడ పట్టి మంచి విత్తనాలను వేరుచేస్తుంది, ఈ యంత్రం ముగ్గురు కూలీల సహాయంతో ఒక గంటలో 3 క్వింటాల్ల మొక్కజొన్న కంకులను నూర్పిడి చేయగలదు. ఈ యంత్రంతో నూర్చటానికి ముందు ప్రొద్దుతిరుగుడు పూలను/మొక్కజొన్న కంకులను బాగా ఎండబెట్టాలి
ధర రూ 65,930 /-
ప్రొద్దుతిరుగుడు పూలు/మొక్కజొన్న కంకులను నూర్పిడి చెసే యంత్రం
ఈ యంత్రం 5 హెచ్.పి మోటార్ సహాయంతో పనిచేస్తుంది. ఈ యంత్రం ప్రొద్దుతిరుగుడు పూలను/మొక్కజొన్న కంకులను నూర్చటమే గాక జల్లెడ పట్టి మంచి విత్తనాలను వేరుచేస్తుంది.ఈ యంత్రం ముగ్గురు కూలీల సహాయంతో ఒక గంటలో 3 క్వింటాల్ల మొక్కజొన్న కంకులను నూర్పిడి చేయగలదు.ఈ యంత్రంతో నూర్చటానికి ముందు ప్రొద్దుతిరుగుడుపూలను/మొక్కజొన్నకంకులను బాగా ఎండబెట్టాలి.
ధర రూ.65,9౩౦/-.
ఆముదం కాయలు నూర్చే యంత్రం:
ఈ యంత్రం ఆముదం కాయలను నూర్చడమే కాక గింజలను జల్లెడ భట్టి శుభ్రపరచిన గింజలను ఇస్తుంది. గంటకు 200 - ౩౦౦ కిలోల గింజలను వలచవచ్చు, బాగా ఎండబెట్టిన కాయలను మాత్రమే ఈ యంత్రంలో వేయాలి .3.౦హెచ్.పి మోటార్ తో నడుస్తుంది.ఈ యంత్రంలో గింజలు పగలటం కానీ లేక కాయలు పూర్తిగా నూర్పిడి కానపుడు గాని సిలిండర్, కన్నేప్ మద్య దూరాన్ని మార్చుకునే సౌకర్యం ఉన్నది.
.ధర రూ 23,640/- (3 హెచ్.పి) , .40,880/- (5 హెచ్.
జత్రోపా కాయలను నూర్చే యంత్రం:
ఈ యంత్రం ద్వారా బాగా ఎండిన జత్రోపా కాయల నుండి గింజలను నూర్చుకోవచ్చును. ఇది 2.0 హెచ్.పి.కరెంటు మోటార్ తో పని చేస్తుంది. దీనిలో కాయలను నూర్చడానికి, గింజలను శుభ్రం చేయడానికి తగిన అమరిక ఉంది. గంటకు 6౦౦ కిలోల గింజలను నూర్చుకోవచ్చును.
ధర రూ.85,200/-
గింజలు తీసేవి వేరుశనగ కాయలను విడదీసే యంత్రం:
ఈ యంత్రం 2 హెచ్.పి విద్యుత్ మోటార్ సహాయంతో నడుస్తుంది. పొలం నుంచి తీసిన పంటను ఎండబెట్టనవసరం లేకుండా వెంటనే ఈ యంత్రం సహాయంతో కాయలను వేరుచేయవచ్చు. ఈ యంత్రం నడిచేటప్పుడు వేరుశనగ మొక్కలను అందించటానికి, యంత్రంలో ఉంచటానికి, విడదీసిన వేరుశనగ కాయలను పోగు చెయ్యటానికి ఐదుగురు కూలిలూ కావాలి. ఈ యంత్రం కాయలను పూర్హిగా విడదీస్తుంది, కాయ పగలదు. కాయలను విడదియగా మిగిలిన మొక్కలు ఏ మాత్రం పాడు కావు గనుక పశువుల దాణాగా ఉపయోగించుకోవచ్చు. ఈ యంత్రం నందు పనిచేసే కూలీల చేతులు యంత్రానికి తగలకుండా జాగ్రత్త పడాలి,తాము కట్టుకున్న బట్టలు యంత్రంలో తిరిగే భాగాలకు తగలకుండా జాగ్రత్త పడాలి
ధర రూ 18,040/-
వేరు శనగ కాయలను వలిచే పరికరం:
ఈ పరికరం సహాయంతో వేరుశనగ కాయలనుండి గింజలను వేరుచేసుకోవచ్చు, ఒక మనిషి సులభంగా దీనిని నడుపగలడు, ఒకేసారి ౩ కిలోల కాయలను వేసి గింజలను వేరుచేసుకోవచ్చు, తొక్కులను, విత్తనాన్ని చెరగటం ద్వారా వేరుచేసుకోవాలి. గింజలు పగులుతుంటే జల్లెడకు ఇనుప దిమ్మెలకు మద్య దూరాన్ని సరిచేసుకోవాలి.
ధర రూ.750/- గింజలను శుభ్రపరిచే యంత్రం:
ఈ యంత్రం 3.౦ హెచ్.పి.మోటార్ తో నడుస్తుంది. ఆయా పంటలను బట్టి దీనిలోని జల్లెడలను మార్చుకోవాలి. దీని సహాయంతో పంటను బట్టి ౩ - 6 క్వింటాల్ల ధాన్యం శుభ్రపర్చుకోవచ్చు.
ధర రూ.26,000/-
మొక్కజొన్న కండెలపై పొర తీసి నూర్చే యంత్రం:
ఈ యంత్రం 35 హెచ్.పి ట్రాక్టర్ పి.టి.ఒ ద్వారా పని చేస్తుంది. యంత్రంలో బాగా ఎండిన మొక్కజొన్న కండెలను పై పొరను తీయకుండా వేసిన యెడల పై పొరను తీసి గింజలను నూర్చును.కండెల యొక్క తేమ శాతం ఎక్కువ ఉన్న ఎడల యంత్రంలో చుట్టుకొని పోవును.ఈ యంత్రంలో కండెల నుండి పై పొరను తీయుటకు,నూర్చుటకు మరియు గింజలను శుబ్రం చేయుటకు తగిన అమరిక కలదు.ఈ యంత్రం ద్వారా గంటకు 450-650 కిలోల గింజలను నూర్చవచ్చును.దీనితో నూర్చుకున్న యెడల 85శాతం వరకు లేబరు ఆదా చేసుకొనవచ్చు.ధర రూ.37,000/-.
కోత కోసేవి వరి కోత యంత్రం:
ఈ యంత్రం 5 హెచ్.పి దీజిల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ యంత్రాన్ని ఒక మనిషి నడుపుతూ ఒక ఎకరా వరి పొలాన్ని 2 గంటల్లో కోయగలడు. ఈ యంత్రంలో క్రింది భాగాన అమర్చబడిన బ్లేడ్లు వరి పొలాన్ని, బెల్టులు కోసిన వరిని కుడివైపు వరుసలలో వేస్తాయి.
ఈ యంత్రం నడపడానికి గంటకు ఒక లీటరు డిజిల్ ఖర్చవుతుంది. ఈ యంత్రం నిలబడి ఉన్న వరి పొలాన్ని మాత్రమే కోయగలదు. కోతకు కనీసం వారం రోజులకు ముందు పొలానికి నీరు పెట్టడం ఆపి బాగా ఆరనివ్వాలి. ఈ యంత్రం నడపడానికి ముందు గట్ల వెంబడి మ 50 సెం.మీ వెడల్పుతో వరిని కొడవలితో కోయాలి.
దీని ధర రూ 74,630-99,520.
వరి కోసే యంత్రం:
ఈ యంత్రం రెండు విధాలుగా లభ్యమవుతోంది. .ఒక రకంలో గింజలు నిల్వ చేసుకోవడానికి వీలుంది. మరొక దాంట్లో అది వీలు కాదు. ఇది 50 లేదా 66 హెచ్.పి. డిజిల్ ఇంజన్ పైన నడుస్తుంది. దీనితో గంటకు ఎకరం పొలము కోయవచ్చు. దీనిని వాడటం వలన రైతుకు ఎకరానికి రూ.1,000 - 1,500 వరకు ఆదా అవుతుంది. .
ధర రూ.14,౦౦,౦౦౦/-నుండి 23,౦౦,౦౦౦/-.
కర్షక్ ఇందుస్త్రిస్, 18-3014, చత్రినాక, లాల్ దర్వాజ, హైదరాబాద్- 5౦౦ 253,
ఫోన్ నెం 24384680, 24382841.
కర్షక్ అండ్ సన్స్,షాప్, నెం.42, ఆల్ కరీం ట్రేడ్ సెంటర్, యం.జీ.రోడ్డు, సికింద్రాబాద్-500 ౦౦3, ఫోన్ నెం 27542315
మేకిన్స్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెం.30, ఐ.డి.ఎ.గాంధీ నగర్, బాల నగర్, హైదరాబాబ్ -500 ౦౩7, ఫోన్ నెం.23085959
ఇంకాస్ ఇంజనీర్స్ లిమిటెడ్, బి6/3, ఐ.డి.ఎ.ఉప్పల్ .హైదరాబాద్-500౦౩9, ఫోన్ నెం.27204034, 27201271.
బోయీస్ టౌన్, జహనుమ,, హైదరాబాద్, ఫోన్ నెం.24464511
రైట్ సెట్ ఇండస్ట్రీస్, గుడివాడ, కృష్ణా జిల్లా,ఫోన్ నెం.0864-2439976
.మోడరన్ ఆర్క్ వెల్డింగ్ వర్క్స్, 16-256-7/1, యస్.యస్.పురం, గుడివాడ, కృష్ణా జిల్లా
రవి ఇంజనీరింగ్ వర్క్స్, ఆర్,యస్.రోడ్డు, నంద్యాల, కర్నూల్ జిల్లా. ఫోన్ నెం.08514-244169
.భాస్కర్ ఇంజనీరింగ్ వర్క్స్, ఆర్.యస్.రోడ్డు, నంద్యాల, కర్నూల్ జిల్లా ఫోన్ నెం.08514-244169.
.కుమార్ ఇంజనీరింగ్ వర్క్స్, బనగాన పల్లి రోడ్డు,కోయిలకుంట్ల, కర్నూల్ జిల్లా.
మహబూబ్ ఇంజనీరింగ్ వర్క్స్, ఎన్. .హెచ్.-6, నంద్యాల రోడ్డు, తాడిపత్రి, కర్నూల్ జిల్లా.
రసూల్ ఇంజనీరింగ్ వర్క్స్, గుంతకల్, అనంతపూర్ జిల్లా
ఇందిరా ఇంజనీరింగ్ వర్క్స్, తపోవనం బైపాస్ రోడ్, అనంతపురం, ఫోన్ నెం.940-221252
బాలాజీ ఇంజనీరింగ్ వర్క్స్, ఆర్.టి.సి బస్టాండ్ దగ్గర,అనంతపూర్.
బిలాని ఇండస్ట్రీస్, ఆత్మకూర్, అనంతపూర్ జిల్లా. ఫోన్ నెం.25౦౦80
.శ్రీనివాస ఇంజనీరింగ్ వర్క్స్, బళ్ళారి రోడ్డు,కర్నూల్ ఫోన్ నెం.259472
యస్ డి ఆర్ ఎంటర్ ప్రైజెస్, 9/21, పి.యస్.రోడ్డు, చంద్రగిరి- 511 ౦౦1, ఫోన్ నెం 0877-౩120970
.జ్యోతి ఇండస్ట్రీస్, పలమనేరు రోడ్డు, చిత్తూరు. ఫోన్ నెం.9849466729
.నవ్య ఆగ్రో ఇండస్ట్రీస్, 1-3/12 పామర్రు రోడ్డు, రైల్వే గేటు దగ్గర, గుడివాడ-521 301, కృష్ణా జిల్లా, ఫోన్ నెం.08674-244597.
వి.ఎస్.టి. టిల్లర్స్ లిమిటెడ్, పి.బి.నెం.4801, మహాదేవపుర పోస్ట్, వైట్ ఫీల్డ్ రోడ్,
బెంగుళూర్ - 560 048,ఫోన్ నెం.080-28518065/6/7
వర్ష ప్రియ అగ్రోటేక్ ప్రైవేట్ లిమిటెడ్, ఆగ్రో మిషనరీ డివిజన్, 195, 7 వ క్రాస్, ఫస్ట్ స్టేజి, ఇందిరానగర్, బెంగుళూర్-560 ౦౩8, ఫోన్:080-2525 ౦౩97
వ్యవసాయ పరికరాలు, యంత్రాలపై మరిన్ని వివరాలకు:
ప్రిన్సిపల్ సైంటిస్ట్ (అగ్రి ఇంజనీరింగ్), వ్యవసాయ పరికరాలు మరియు యంత్రాల విభాగం,
ఆచార్యఎన్.జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్-500 ౦౩0
ఫోన్ నెం.040-24018277 లేదా 040-24015011 ఎక్స్ టెన్షన్-438