Green chilli and Garlic extract/ పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం
< Prev
1
2
3
Next >
+
-
తయారుచేసే విధానం
౩ కిలోల పచ్చిమిరపకాయలను కాడలు తీసి వాటిని మెత్తగా నూరి, దానిని 10 లీటర్ల నీటిలో ఒక రాత్రంతా బాగా నానబెట్టాలి.
అరకేజీ వెల్లుల్లిపాయలను పొట్టుతీసి వాటిని బాగా నూరి 250 మీ.లీ. కిరోసిన్లో ఒక రాత్రంతా నానబెట్టాలి.
మర్నాడు పచ్చిమిర్చి ద్రవనంను ఒక పలుచని గుడ్డతో వడపోయాలి.
మిరప ద్రావణం, వెల్లుల్లి ద్రావణం, 100 గ్రాముల సబ్బుపొడి ద్రావణం, ఈ మూడింటిని బాగా కలిపి మిశ్రమాన్ని తయారుచేయాలి.
ఈ విధంగా తయారు చేసిన ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పొలంలో పిచికారి సాయంత్రం పూట చేయాలి.