లక్షణాలు:

ఈ జలగలు ముక్కు రంద్రాలలో స్తిర నివాసము ఏర్పరచుకోవడం వలన ముక్కులో కురుపులు ఏర్పడి క్రమేపి కాలి ఫ్లవర్ లాగ ఏర్పడతాయి.  దురద వలన పశువులు ముక్కులు విరుస్తుంటాయి. 

ముక్కువెంట చక్కని జిగురు పదార్ధం పారుతుంది.  శ్వాస పీల్చడం ఇబ్బంది అవుతుంది.  శ్వాస సమయంలో బుస కూడా వినబడుతుంది.

ఈ వ్యాధి సోకినా ఆవులు, గేదేలలో పాల ఉత్పత్తి తగ్గిపోయి, రైతులకు ఆర్ధికంగా నష్టం కలుగుతుంది.

వ్యాధి సోకినా పశువులు నిరసించి పోయి వాటిలో పని సామర్ధ్యం, పాల ఉత్పాదక శక్తీ తగ్గుతుంది.

నల్ల పశువులలో ఈ లక్షణాలు స్పష్టంగా కనబడవు.

తుమ్ముట, దగ్గుట వలన పశువులు పై పెదవి విరుచుకుంటూ ఉంటాయి.

కొన్ని సందర్బాలలో గంగడోలు, బొడ్డు దగ్గర నీరు దిగి వాపు వస్తుంది.