వ్యాధి లక్షణాలు :
పశువు తల మెడ ఒక వైపుకు తిరిగి తలను డొక్కలో పెట్టుకుని పడుకుంటుంది.
నీరసముతో మేత మేయక ఉంటాయి.
అశ్రద్ద చేసిన, జబ్బు ప్రమాదకరముగా మారి పశువుకు తీరని నష్టము కలుగజేస్తుంది.
ఈ వ్యాధి సోకినా పశువులలో పడిపోవుట, తన్నుకొనుట, కండరాలు వణుకుట వంటి లక్షణాలు కనపడుతాయి.
కళ్ళ నుండి నీరు కురుతూ, చెవులు వాలి ఉంటాయి.
కొన్ని పశువులలో చూపు మందగించ వచ్చు.
పశువు చిరాకుగా వుండి ఉలికిపాటు ఉంటుంది.