లక్షణాలు:
పశువులు దురదతో చిరాకుగా ఉండి, శరీరాన్ని గోడలకు, చెట్లకు రాసుకుంటాయి.
బాహ్య పరాన్న జీవులు రక్తాన్ని పిల్చి పశువులలో రక్తహీనత కలుగజేస్తాయి.
పశువులు నిరసించి పోయి వ్యాధి నిరోధక శక్తీ తగ్గుతుంది.
కొన్ని రకాల మొక్కల వలన, క్రిమి సంహారక మందుల వలన చర్మం పై చిన్న చిన్న మచ్చలు, పొడలు ఏర్పడి శరీరమంత వ్యాపిస్తాయి.
గోమార్లు పిడుదుల వలన శరీరంపై పుండ్లు ఏర్పడి పశువుకు అసౌకర్యం కలుగుతుంది.