లక్షణాలు:
ఈ వ్యాధి సోకినా పశువులలో మూత్రం ఎరుపు రంగులో గాని కాఫీ రంగులో గాని ఉంటుంది.
రక్త హీనత ఏర్పడడం వలన పశువు నిరసించి పోతుంది. కామెర్లు వ్యాధి కుడా రావచ్చు.
పశువులు నిరసించి, పాల దిగుబడి, పనిచేసే సామర్ధ్యం తగ్గిపోతుంది.
జ్వర తీవ్రత అధికంగా 10౩ డిగ్రి ఎఫ్.- 106 డిగ్రి ఎఫ్ వరకు ఉంటుంది.
ఆకలి మందగించి పశువులు నెమరు వేయవు.
దూడలలో వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనిపించవు.