నివారణ :

వ్యాధి ప్రభలిన ప్రాంతంలో ప్రతి సంవత్సరం టీకా మందు ఇవ్వాలి. 

ఏదైనా ప్రాంతంలో ఆత్రాక్స్ వ్యాప్తి చెంది నట్లు వార్త వచ్చిన వెంటనే మిగిలిన ఆన్ని పశువుల్లో టీకాలు ఇవ్వాలి. టీకా మందు 1 మీ. లీ. చర్మం క్రింద ఇవ్వాలి. ఈ టీకా మందును ప్రభుత్వం ఉచితంగా సరపరా చేస్తుంది.

చనిపోయిన లేక వ్యాధి గ్రస్తమైన పశువుల మాంసం తినడం వల్ల మరియు చర్మం ద్వారా ఈ రోగం మనుషుల్లో కూడా వస్తుంది.

వ్యాధి సోకిన మనుషుల్లో నిమోనియాతో కూడిన జ్వరం లేదా చేతులపై చర్మం మీద పుండ్లు ఏర్పడవచ్చు.