నివారణ :

పాకలను పరి శుభ్రంగా ఉంచి, వీలైనంత పొడిగా ఉంచాలి.

పాడి పశువులను పరి శుభ్రంగా ఉంచాలి.  పాలు పితికే ముందు పొదుగును గోరు వెచ్చని నీళ్ళతో కడిగి శుభ్రమైన గుడ్డతో తుడవాలి.

పాలి  పితికే వారి చేతులకు గోళ్ళు లేకుండా శుభ్రంగా వుండాలి.

పొదుగులో పాలు లేకుండా మొత్తం పితికివేయాలి.

గర్భకోశ వ్యాధి కలిగిన పశువులలో మానం గుండా కారే చీము, రక్తం పొదుగును తాకకుండా ఎప్పటికప్పుడు శుభ్ర పరచాలి.