దూడల మరణాలు ఎలా నివారించాలి?
బొడ్డు సరియైన పద్దతిలో ట్వయిన్ దారంతో రక్త స్రావం రాకుండా గట్టిగా కట్టి బొడ్డు కత్తిరించి అయోడిన్ పూయాలి. పుట్టిన దూడకు ముక్కు, నోరు తుడిచి అరగంట లోపు జున్నుపాలు తాగించాలి.
దూడలు పుట్టిన 7, 28, 60,90,12౦ రోజుల వయస్సులో తప్పని సరిగా నట్టల మందులు త్రాగించాలి.
4-6 మాసాల వయస్సులో గొంతు వాపు, జబ్బ వాపు, థెఇలెరియాసిస్ టి కాలు వేయించాలి.
పరిసరాలలో సున్నపు పొడి, క్రిమి సంహారక మందులు చల్లాలి.