A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు ::

పేనుబంక అప్పుడప్పుడు చాల ఉదృతంగా పంట బెట్టకు గురయినప్పుడు వస్తుంది. ఇవి ఇంకా మొక్క జొన్న, సజ్జ, రాగి, గోధుమ పంటలను కుడా ఆశిస్తుంది. చిన్న పెద్ద పురుగులు ఆకుపచ్చ, నీలిరంగు కలిసిన రంగులో ఉంటాయి. ఈ పురుగుల సముదాయం ఎక్కువైనప్పుడు కొన్నిరెక్కల పురుగులుగా మారి వేరే చోటుకు ఎగిరిపోయి అక్కడి పంటలను ఆశిస్తాయి. ఇవి ఆకులనుండి మరియు లేత కంకి నుండి రసం పీలుస్తాయి. ఇది విసర్జించిన తేనే వంటి బంక మీద మసితెగులు వస్తుంది.  పేనుబంక ఆశించిన ఆకుల మీద పసుపురంగు మచ్చలు ఏర్పడుతాయి. ఇవి ఆశించిన మొక్కల పెరుగుదల తగ్గి మాడిపోయినట్లు కనిపిస్తాయి. పైరు చిన్నదశలో పెనుబంక ఆశిస్తే, ఆ మొక్కలకు కంకులు రాక పోవడం సహజంగా జరగవచ్చు. ఆశించిన కంకులలో గింజలు సరిగాపట్టవు.