తెగులు సోకిన కంకి భాగాల నుంచి చిక్కటి జిగురు లాంటి ద్రవం కారుతూ ఉంటుంది. ఇది చీమలను, పురుగులను ఆకర్షిస్తుంది. ఆయా భాగాల చుట్టూ ఇలా చీమలు, క్రిములు చేరడం ఈ తెగులు సోకిందనడానికి ప్రధాన సూచిక.
తెగులు సోకిన కంకి ఫంగస్ వల్ల నల్లగా మారుతుంది. తెగులు సోకిన గింజ తేమ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో, లేత గోధుమ రంగులో తిన్నగా లేదా వంకరగా ఉన్న గట్టి కణజాలంగా మారుతుంది.
తెగులు సోకిన మొక్క మొదట్లో, నేల అడుగు భాగాన తెల్లటి మచ్చలు కనపడతాయి. పై నుంచి కారిన జిగట ద్రవపు చుక్కలతో ఈ తెల్లటి మచ్చలు ఏర్పడతాయి.