A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

లక్షణాలు :

నీళ్ళు పెట్టిన మిరప పంట కన్నా నీళ్ళు పెట్టని పంటలోనే ఈ పురుగు ఎక్కువగా వస్తుంది.

పిల్ల పురుగులు, పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల మీద కణజాలాన్ని తినేస్తాయి.  రసాన్ని పీల్చేస్తాయి.  కొన్ని సార్లు, మొగ్గలు, పువ్వులను కూడా నాశనం చేస్తాయి.

మామూలుగా పురుగు లేత ఆకులను,   ఇతర లేత భాగాలపై మాత్రమే ఎక్కువగా దాడి చేస్తుంది.  పెరిగిన ఆకుల జోలికి పోదు.  

పురుగు దాడి వల్ల ఆకులు పైకి వంకర తిరుగుతాయి. వడలి రాలిపోతుంటాయి.  పురుగు సోకిన మొగ్గలు బలహీనంగా మారి విరిగిపోతాయి.

ఆకు కాడ కూడా గోధుమ రంగుకు మారి పడిపోతుంది.

పురుగు వల్ల దెబ్బ తిన్న పండ్లపై లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.   

వాతావరణం పొడిగా ఉన్నప్పుడు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

పురుగు సోకినప్పుడు పంట నష్టం 30% – 50% వరకు ఉంటాయి.