లక్షణాలు
- పంట లేతగా ఉన్నప్పుడే ఈ పురుగు ఆశిస్తుంది.
- కాండం తెరిచి చూసినప్పుడు, గుల్ల మాదిరిగా కనపడుతుంది. లోపల పురుగు విసర్జించిన పదార్థాలు కూడా కనపడతాయి.
- ఆకులు రాలిపోతుంటాయి. మొక్క కూడా వదలినట్లు కనపడుతుంది.
- లేత మొక్కలు పసుపు రంగులోకి మారతాయి.
- కాండంలో పిల్ల పురుగులు, ప్యూపా ఉన్నప్పుడు అది ఉబ్బినట్టు కనపడుతుంది.
- లేత మొక్క పై కాండం దెబ్బతిని, వదలినప్పుడు, మొక్క చనిపోతుంది.
- వడలిన కాండాన్ని దగ్గరగా పరిశీలించినప్పుడు, అడుగు భాగంలో పిల్ల పురుగులు, ప్యూపా స్పష్టంగా కనపడతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు : కాండం